వంట పనితీరులో మచ్చ వెంకటేష్ భేష్
By
Vaasthava Nestham
- జిల్లాస్థాయిలో రెండో బహుమతి పొంది జాతీయ స్థాయికి ఎంపికైన మచ్చ వెంకటేష్
- సన్మానించిన యువకులు
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: వంట పనితీరులో జిల్లా స్థాయిలో రెండవ బహుమతి అందుకొని రాష్ట్రస్థాయికి ఎంపికైన మచ్చ వెంకటేష్ ను అందరూ అభినందిస్తున్నారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని జడ్పీఎస్ఎస్ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో వంట పని మనిషిగా పనిచేసే వెంకటేష్ , జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని డైట్ కాలేజీ మైదానంలో వంట పనితీరును పరిశీలనలో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలో రెండవ బహుమతి అందుకుని రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం ఎస్సీ కాలనీ యువకులు మచ్చ వెంకటేష్ ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
Comments