-Advertisement-

Ichoda : గ్రామ అభివృద్ధి ప్రతి ఒక్కరి బాధ్యత

Vaasthava Nestham

- ఇచ్చోడ నూతన వీడీసీ కమిటి ఎన్నిక

- హాజరైన అన్ని కుల సంఘాల పెద్దలు


వాస్తవ నేస్తం,ఇచ్చోడ: గ్రామాభివృద్ధి ప్రతి ఒక్కరి బాధ్యత అని ఇచ్చోడ నూతన వీడీసీ సంఘం సభ్యులు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో 
మేస్త్రి సంఘం అధ్యక్షుడు రేణికుంట సురేష్ అధ్యక్షతన నూతన వీడిసి సంఘం ఎన్నిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల కేంద్రంలోని అన్ని కుల సంఘాల సభ్యులు హాజరై ఇచ్చోడ నూతన వీడిసి కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో వివిధ కుల సంఘ పెద్దలు మాట్లాడుతూ.. అన్ని కుల సంఘాలు ఏకతాటిపైకి వచ్చి గ్రామాభివృద్ధికి తోడ్పడాలన్నారు. నూతన వీడీసీ కమిటీ సభ్యులు గ్రామాభివృద్ధి కోసం ముందుకు సాగాలన్నారు. గ్రామ అభివృద్ధి జరగాలంటే వీడిసి పాత్ర కీలకమైందన్నారు. అన్ని కుల సంఘాలు కలిసికట్టుగా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ముందుకు రావాలన్నారు. వచ్చేనెల 5వ తేదీన ఇచ్చోడ వీడిసి సంఘం శాశ్వత అధ్యక్షులు, కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల పెద్దలు పాల్గొన్నారు.
Comments
 -Advertisement-