-Advertisement-

Breaking News: గుడిహత్నూర్'లో ఉద్రిక్తత

Vaasthava Nestham

- మైనర్ బాలిక కిడ్నాప్, పోలీసుల లాఠీ ఛార్జీ
- రాళ్ల దాడిలో గాయపడ్డ సీఐ, ఎస్సై 
 - రిమ్స్ కు తరలింపు


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ బ్యూరో: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రం శనివారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గుడిహత్నూర్ కూ చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేశారన్న ఆగ్రహంతో యువకుడి ఇంటి పై బాధిత కుటుంబ సభ్యులు రాళ్ళ దాడి చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇచ్చోడ సీఐ భీమేష్, ఎస్సై తిరుపతి కిలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. ఇంట్లోనే యువకుడు అపస్మారక స్థితిలో ఉండటంతో అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం పోలీసులు చేయడంతో నిందితున్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ధీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ పెరగడంతో పోలీసులు లాఠీ చార్జీ చేయడంతో, మైనర్ బాలిక బంధువులు రాళ్ళ దాడి చేయడంతో సీఐ, ఎస్సైకి గాయాలు అయ్యాయి. పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేశారు. ఇద్దరిని ఆదిలాబాద్ రిమ్స్ హాస్పటల్ కూ తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరువుతున్నారు.
Comments
 -Advertisement-