-Advertisement-

పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో ఘర్షణ

Vaasthava Nestham

- ఒకరిపై ఒకరు కర్రలతో విచక్షణ రహిత దాడులు 
- న్యూ ఇయర్ వేడుకల్లో గలాట 
- సిబ్బంది నిర్లక్ష్యమే ఈ ఘర్షణకు కారణమా..?


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: అది ప్రభుత్వ మెట్రిక్ వసతిగృహం.. ఇక్కడ విద్యను అభ్యసించే విద్యార్థులందరూ ఓ సామాజిక వర్గానికి చెందినవారు... అలాంటి పోస్ట్ మెట్రిక్ వసతిగృహంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్లో ఘర్షణ తలెక్కింది. ఒకరిపై ఒకరు విచక్షణ రహితంగా కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల మండల కేంద్రానికి సమీపంలోని ఇచ్చోడ తాండా వద్ద ప్రభుత్వ పోస్టుమెట్రిక్ వసతి గృహం ఘర్షణకు మంగళవారం రాత్రి కేంద్ర బిందువుగా మారింది. పోస్ట్ మెట్రిక్ వసతిగృహం దగ్గరలో కొందరు వ్యక్తులు మద్యం సేవిస్తూ ఉండటాన్ని గమనించిన విద్యార్థులు వారితో వాదనకు దిగారు. ఇక్కడ ఎందుకు మద్యం సేవిస్తున్నారని ప్రశ్నించడంతో బయట వ్యక్తులకు, విద్యార్థులకు మధ్య ఘర్షణ తలెత్తినట్లు తెలుస్తోంది..? దీంతో వసతిగృహం ఆవరణలో ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకోవడంతో వసాతి గృహం ఆవరణ రణరంగంగా మారింది. వసతి గృహం ఈలలు, కేకలు, అరుపులతో దద్దరిల్లింది. 

వసతిగృహ సిబ్బంది నిర్లక్ష్యం..?


రాత్రి సమయాల్లో వసతి గృహాలకు సంబంధించిన ప్రధాన గేట్లు లాక్ చేయాలని నిబంధనలు ఉన్నాయి. అదేవిధంగా బయట వ్యక్తులకు ఎలాంటి ప్రవేశం ఉండదు. అత్యవసరం ఉంటే ప్రిన్సిపాల్, సిబ్బంది అనుమతి తీసుకుని వసతి గృహం లోకి వెళ్ళాలి. ఇన్ని నిబంధనలు ఉన్నా కూడా రాత్రి సమయంలో వసతి గృహం ఆవరణలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నది బయటి వ్యక్తులా..? లేదా బయట వ్యక్తులకు, విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగిందా..? అనే ప్రశ్నలు ఉప్పన్నమవుతున్నాయి. ఈ దాడుల్లో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి అయినట్టు తెలుస్తుంది. దీంతో వసతి గృహంలో ఉండే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రాణ నష్టం జరిగితే బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు. ఇట్టి ఘర్షణపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపడితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మా విద్యార్థులు కారు.. బయటి వ్యక్తులు: ప్రిన్సిపల్ అనీల్

ఇట్టి విషయంపై పోస్ట్ మెట్రిక్ వసతి గృహం ప్రిన్సిపాల్ అనీల్ ను వివరణ కోరగా.. దాడి చేసుకున్న వారు తమ వసతి గృహానికి చెందిన విద్యార్థులు కారువాని, వారు బయట వ్యక్తులు అని తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల సెలబ్రేషన్ కోసం బయటి వ్యక్తులు వసతి గృహంలోకి ఎలా వచ్చారని ప్రశ్నించగా సమాధానం దాటివేశారు.

పిలిస్తే రావడం లేదు : ఎస్సై తిరుపతి 


ఈ ఘర్షణ తిరుపతిని సంప్రదించగా.. ఘర్షణ జరిగిన విషయం వాస్తవమేనని తెలిపారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న వారిని విచారణ కోసం స్టేషన్ కు రావాలని సమాచారం ఇస్తే రావడంలేదని ఎస్సై తెలిపారు. మద్యం మత్తులోనే ఇరువురి మధ్య ఘర్షణ జరిగినట్లు ఎస్సై పేర్కొన్నారు.
Comments
 -Advertisement-