-Advertisement-

ఏవి ఆనాటి సంబరాలు..!

Makar Sankranti festival celebrations Why Makar Sankranti is celebrated About Sankranti in English Makar Sankranti in Hindi Sankranti meaning
Vaasthava Nestham

- దెబ్బతీస్తున్న కార్పొరేట్ కల్చర్.. తగ్గుతున్న ఆసక్తి..

- వినపడని పేర్లు.. పదాలు..
- కనుమరుగవుతున్న సంక్రాంతి శోభ


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ బ్యూరో: సంక్రాంతి వచ్చిందే తుమ్మెద... సరదాలు తెచ్చిందే తుమ్మెద.. సంక్రాంతి అనగానే మనందరికీ గుర్తు కొచ్చేవి హరి దాసు సంకీర్తనలు.. గంగిరెద్దులు. భోగిమంటలు... బొమ్మల కొలువు.. పట్టు పరికిణీల సింగరాలతో రంగులద్దే రంగవల్లికలు... చిరునవ్వులు చిందిస్తూ భోగిపళ్ళు పోసుకునే చంటి చిన్నారులు... భం భం.. భం.. జంగం దేవరా.. బుడబుక్కలోల్లు.. చెక్క భజనలు.. పగటి వేషగాళ్ళు.. ఎడ్ల పందేలు.. కోడి పందేలు.. గాలిపటాల రెపరెపలు.. పండగలలో సంక్రాంతి ప్రధానమైనవి.. పల్లె అందాలను ఆరబోసి ఇలాంటి సంప్రదాయాలు ఈ ఆధునిక సమాజంలో అంతగా కానరావడంలేదు. ఈ మకర సంక్రాంతి అసలు మూడు రోజుల పండగ భోగి.. సంక్రాంతి.. కనుమ.. సంక్రాంతి పండుగ పై "వాస్తవ నేస్తం" ప్రత్యేక కథనం...

భోగి పండుగ...


ధనుర్మాసం 30 రోజుల్లో గోదాదేవి, శ్రీరంగనాథున్ని రోజుకు ఒక పాశురంతో శ్రోత పఠనం చేసి సకల భోగాలను స్వామి వారి నుంచి పొందినది ఈరోజే. కాబట్టి భోగి అంటారు. దేవతలకు దీపపు వెలుగుని చూపడం కోసం భోగి మంటలు వేస్తారని ప్రతీతి.
మకర సంక్రాంతి... పండిన పంట చేతి కొచ్చి రైతుల ఇండ్లు కళకళ లాడుతుంటాయి. ఈరోజు ప్రత్యేకించి సంక్రాంతి లక్ష్మికి విశేషంగా పూజలు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో కొత్త కోడల్ని ధాన్యం పై నడిపిస్తారు. మకర సంక్రాంతిని తిల సంక్రాంతి అని కూడా అంటారు. ఈరోజు నువ్వులతో కూడిన తీపి తింటే శని దోషం ఉండదని తెలంగాణ ముత్తైదువుల నమ్మకం. 
"నువ్వులు తిని నూరేళ్లు బతుకు బిడ్డ", "తీపి తిని తియ్యగా మాట్లాడు బిడ్డ" అని పెద్దలు పెద్ద మనసు తో దీవిస్తారు. ప్రాంతీయతను బట్టి సంక్రాంతిని పంటల పండుగని, ముగ్గుల పండుగని, ఆమని పండుగని, అల్లుళ్ళ పండుగని, జానపద పండుగని ఇలా అనేక రకాలుగా పిలుస్తారు.

ముగ్గుల పండుగ..


సంక్రాంతికి మరో ముచ్చటైన పేరు ముగ్గుల పండుగ. సంక్రాంతి పండుగకు వారం రోజుల ముందు నుంచే రంగురంగు రంగవల్లికతో ప్రతి ఇల్లు కళకళ లాడు తుంటుంది. ఆధ్యాత్మికంగా చూస్తే ముగ్గు మధ్యలో గుడి ఉంటుంది. ఆకాశంలో అన్ని గ్రహాలకి ఆధార మైన సూర్యుడు మధ్యలోనే ఉంటాడు. అందుకే సూర్యునికి సంకేతంగా ఎర్రని కుంకుమతో నింపు తారు మహిళలు.
Vaasthava Nestham Telugu Daily


హరి హరి నారాయణ...


ధనుర్మాసం నెల రోజుల్లో వేకువనే నగర సంకీర్తనలు చేస్తూ వచ్చే హరిదాసు అసలు ముఖం అందరు చూసేది ఈ సంక్రాంతి రోజే. చేతిలో చిరుతలు, నెత్తిన తల పాగా, దానిపై గుమ్మడికాయ ఆకారంలో ఉన్న పాత్ర నుదుటన బొట్టు, చేతికి కంకణం, తులసి పూసల మాలలు, కాళ్ళకి పావు కోళ్లతో ప్రత్యేకమైన శైలిలో ఉండే హరిదాసును ఇల్లాలు తప్ప ఎవరు చూడలేరు. హరిలో రంగహరి అనే ఈ పాటలు ఇందుకు సంకేతం..


డూ... డూ బసవన్న..


డోలు, సన్నాయి వాయిద్యాలతో ముప్పురం పై రంగు రంగుల బట్టలతో కొమ్ములకు కుచ్చు తోరణాలు.. మెడలో గంటలతో అందంగా అలంకరించబడిన ఎద్దుని ప్రతి ఇంటి ముంగిట నిలబడతారు. "అయ్యగారికి దండం పెట్టు".. " అమ్మగారికి దండం పెట్టు".. ముక్కాలి పీఠ మీద కాలు పెట్టించి ఆడిస్తారు. గంగిరెద్దులవారు అంటే ఇష్టపడని వారుండరు.

గాలి పటాలు...


గాలిపటాలు ఎగిరేయడం ఒకప్పుడు గ్రామీణ ప్రజల క్రీడగా ఉండేది. పిల్లలు.. పెద్దలు ఇండ్ల పైన, డాబాల పైన గాలిపటాలు ఎవరు వేస్తారు. "పద పదవే వయ్యారి గాలి పటమా" అంటే ఎగిరేయడం కూడా ఒక కళే. ఆకాశానికి ఎగిరిన గాలి పటాలు పట్టపగలు నక్షత్రాల్లా కనిపిస్తాయి.
Vaasthava Nestham Telugu Daily


జంగం దేవరా...


భం.. భం.. భం.. భం.. జంగం దేవర అంటూ శంఖారావం చేస్తూ చేతిలో గంట వాయిస్తూ ప్రతి ఇంటి ముందు బిక్షాటన చేసే వారిని చూస్తే పిల్లలు జడ్చుకుంటారు. పెద్ద కలపాగ, నుదుటన పెద్ద బొట్టు, చేతిలో గంట.. ప్రత్యేకమైన శబ్దం చేస్తూ జంగం దేవర తిరుగుతూ ఉంటారు.

పగటి వేషగాళ్లు...

ప్రతి పల్లెలోనూ పగటివేషగాళ్లు అనేక రూపాల్లో దర్శనమిస్తారు వినాయకుడు, శివుడు, పార్వతి, గంగమ్మ, సీతారాములు, ఆంజనేయులు ఇలా మనకు పురాణాల్లో కనిపించే అనేక పాత్రలకు ప్రతి రూపాలుగా వేషదారణలతో పాటలు పాడుతూ వీధుల్లో తిరుగుతుంటారు. ఊరి పెద్దలు, పెత్తందార్లు వీరుని ఘనంగా సత్కరిస్తారు.
Vaasthava Nestham News paper


కనుమ...


కనుమ నాడు కాకి అయిన ఇల్లు వదలదని పెద్దలు అంటారు. ఈరోజు తమ తమ వంశంలో మరణించిన పెద్దలని పేరు పేరునా తలుచుకొని గారెలు, నువ్వులు పిండాల్ని భక్ష్యాలుగా చేసి నివేదిస్తారు. ఇవి తినడా నికి కాకులు వస్తాయి. కాకులు శ్రాద్ధ కర్మలకు సంకే తం. కనుమ పశువులకు చాలా ప్రాధాన్యతమిచ్చే దినం. ఎంతో కష్టపడి మనకి పాడి పంటలను ఇచ్చే పశువులను పూజించడం మన ఆచారం. "పాలిచ్చే పశువులకు పసుపు, కుంకుమ.. పనిచేసే బసవుడికి పత్రి పుష్పం" అని కవి గారు ఊరికే అన్నారా.. పండుగ విశిష్టత, ప్రాముఖ్యతను కాపాడానికి వివిధ పాఠశాలలో అవగాహన కల్పిస్తూ పాటుపడటం.. కృషి చేయడం.. శుభపరిణామని చెప్పుకోవచ్చు.
Comments
 -Advertisement-