-Advertisement-

ఎన్నో ఏళ్ల కల సాకారం..

Turmeric board telangana National Turmeric Board UPSC National turmeric Board website National Turmeric Board which Ministry National Turmeric Board h
Vaasthava Nestham

• నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు
• చైర్మన్‌గా పల్లె గంగారెడ్డి నియామకం


వాస్తవ నేస్తం,హైదారాబాద్ : సంక్రాంతి పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం కర్షకులకు తీపి కబురు చెప్పింది. ఏండ్ల తరబడి నిజామాబాద్‌ జిల్లా వాసులు కంటున్న కలను నిజం చేసింది. నిజామాబాద్‌ లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్రమోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం చేయను న్నట్లు ఉత్తర్వులో ప్రకటించింది. పసుపు బోర్డుకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్న పల్లె గంగారెడ్డి నీ పసుపు బోర్డు ఛైర్మన్ గా నియమిం చింది. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగు తారని పేర్కొంది. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ గతంలో హైదరాబాద్ వేదికగా జరిగిన ఓ సభలో చెప్పిన సంగతి తెలిసిందే. జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయడం పట్ల నిజామాబాద్ జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
 -Advertisement-