అయ్యో పాపం.. అప్పుల బాధ తాళలేక భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య
By
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,నిర్మల్: ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక భార్య భర్తలు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన దిలావర్పూర్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలను ప్రకారం... నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు.
సారంగపూర్ మండలం చించోలి(బి) గ్రామానికి చెందిన రిటైర్డ్ కండక్టర్ భాస్కర్ రెడ్డి(63) ఆయన భార్య అనసూయ, ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఓ చెట్టుకు ఉరివేసుకున్నారు. అప్పుల భారంతో పండించిన పంటలు చేతికి రాక అప్పుడు తీరకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరు ఉపాధి కోసం దుబాయ్‌లో ఉంటే, మరొకరు స్థానికంగా ఉంటున్నారు. భార్యాభర్తలిద్దరూ ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments