అక్రమ వెంచర్... అడ్డగోలు అమ్మకాలు...!?
By
Vaasthava Nestham
• అమ్మకాలు సరే... అనుమతుల జాడేది..
• కొనుగోలుదారులకు బురిడీ..
• ప్రభుత్వ ఆదాయానికి గండి
• కొనుగోలుదారులను దగా చేస్తున్న రియాల్టర్, మధ్య దళారులు
• గిఫ్ట్ డీడ్ గా చేసి ప్లాట్ల విక్రయాలు
వాస్తవ నేస్తం,అదిలాబాద్ బ్యూరో : రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమ లేఅవుట్లతో చెలరేగిపోతున్నారు. అనుమతులు లేకుండానే వ్యవసాయ భూముల్లో వెంచర్లు వేసి యధేచ్చగా విక్రయాలు సాగిస్తున్నారు. వెంచర్ లో ఎర్ర మట్టితో స్వల్పంగా రోడ్లు వేసి, మధ్య దళారులను రంగంలోకి దింపి కొనుగోలుదారులను ఆకర్షించేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారు. మాది పాత వెంచర్ అంటూ కొనుగోలుదారులకు అంటగడుతూ దగా చేస్తున్నారు.
అడేగామ (బీ) శివారంలో...
ఏజెన్సీ ప్రాంతమైన ఇచ్చోడ లో గత కొన్ని నెలలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది. దీనిని ఆసరా చేసుకుని ఓ రియాల్టర్ జాతీయ రహదారి 44 కు సమీపంలోని అడేగామ (బీ) శివారంలో ఓ అక్రమ వెంచర్ ను ఏర్పాటు చేశాడు. దీనికి కేవలం నాలా కన్వర్షన్ అనుమతులు తీసుకొని అన్ని అనుమతులు ఉన్నాయని కొలుగోలుదారులను బురిడీ కొట్టిస్తున్నాడు. వ్యవసాయ భూమిని కొనుగులు చేసి, ప్లాట్లుగా మార్చి, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాడు. కేవలం నాల కన్వర్షన్ చేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. గ్రామపంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. దీనికి తోడు డిటిసిపి అనుమతులు తప్పని సరిగా ఉండాలి. ఎలాంటి అనుమతులు లేని ఈ వెంచర్ లో ప్లాట్లు కొనుగోలు చేసిన కొనుగోలుదారులు ఇండ్లు కట్టుకోవాలన్నా, బ్యాంక్ రుణాలు, ఇతర వసతులు కావాలన్నా అనుమతి పత్రాలు తప్ప కుండా జతచేయాల్సి ఉంటుంది. ఇక్కడ అవేమీ కనిపించవు. అంత మోసం.. దగా.. రియాల్టర్, మధ్య దళారులు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా ఉంది. కొనుగోలుదారులకు భవిష్యత్తులో ఎన్ని ఇబ్బందులు ఎదురైతే మాకేంటీ...? ప్లాట్లు అమ్ముడు పోవాలి.. మా లాభం మాకు వస్తే చాలు.. అంటూ చేతులు దులుపుకుంటున్నారు.
ఎలాంటి అనుమతులు లేవు: ఆనంద్ ఎంపీవో ఇచ్చోడ
అడేగామ (బీ) శివారంలో వెలసిన వెంచర్ కు జీపీ నుంచి ఎలాంటి అనుమతులు లేవన్నారు. అనుమతి కోసం దరఖాస్తులు చేసుకోలేదన్నారు. ఇందులో ఎవరు కూడా ప్లాట్లను కొనుగోలు చేయకూడదు. నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు ఏదైనా లే ఔట్‌లో స్థలం కొనుగోలు చేసే ముందు దానికి ప్రభుత్వ అనుమతి ఉందా లేదా అని తప్పనిసరిగా తెలుసు కోవాలి. రహదారులు, ఇతర మౌలిక వసతులు పరిశీలించి అన్ని నిబంధనల ప్రకారం ఉంటేనే ప్లాటు కొనాలి. అక్రమ లే ఔట్ విషయంలో చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.
Comments