-Advertisement-

అడేగామ (బీ) శివారంలో "రియల్" మోసం

Vaasthava Nestham

• అక్రమ వెంచర్ లో నిబంధనలు ఉష్ కాకీ
• అమ్మకాలతో జాతర.. నిబంధనలకు పాతర
• నిబంధనలు ఏం చెబుతున్నాయి..!


వాస్తవ నేస్తం,అదిలాబాద్ బ్యూరో: రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటేనే మోసం.. దగా.. అక్రమ వెంచర్ లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి రియల్ మోసం చేస్తున్నారు. అది అక్రమ లేఅవుట్ అని రియాల్టర్, మధ్య దళారులకు తెలుసు. కానీ కొనుగోలుదారులకు తెలియదు. పై పై మెరుగులు అద్ది మాది అనుమతి తో కూడిన వెంచర్ అంటూ కొనుగోలుదారులను నిండా మునిగేలా చేస్తున్నారు. బయం లేని కోడి పెట్ట బజార్ లో గుడ్డు పెట్టిందని దీన్నే అంటారేమో కాబోలు.. ఇచ్చోడలోని జాతీయ రహదారి 44 కు సమీపంలోని అడేగామ (బీ) శివారంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వెంచర్ వెలిసింది. వ్యవసాయ భూమిని కొనుగులు చేసి, నాలా కన్వర్షన్ అనుమతి తీసుకున్నారు. మిగితా అనుమతులకు మంగళం పాడారు. వాటిని తుంగలో తొక్కారు. వ్యవసాయ భూమిని కొనుగులు చేసి, ప్లాట్లుగా మార్చి, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాడు.

అనుమతులు లేకుండానే...


నాలా (నాన్‌ అగ్రికల్చరల్‌ లాండ్స్‌ అసెస్‌మెంట్‌ యాక్ట్‌) చట్టం-2006 ప్రకారం నాలా చట్టాన్ని అనుసరించి వ్యవసాయ భూములను వ్యవసాయేతర పనులకు ఉపయోగిస్తే ఏక మొత్తంలో ఒకేసారి కన్వర్షన్‌ చార్జీల ను భూమి విలువపై 3 శాతం ప్రభుత్వానికి చెల్లిం చాల్సి ఉంటుంది. కన్వర్షన్‌ అనంతరం భూమిని ప్లాట్లుగా మార్చి విక్రయించాలంటే డీటీసీపీ(డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌) అనుమతి తప్పనిసరి. ఎకరం (40 గుంటలు) స్థలంలో డీటీసీపీ అనుమతికి వెళ్తే 12 శాతం ఓపెన్‌ స్థలం (9 శాతం గ్రీనరీ, 1 శాతం వాటర్‌ ట్యాంక్‌, సెప్టిక్‌ ట్యాంకులు, 1 శాతం వాణిజ్య అవసరాలు, 1 శాతం హెల్త్‌ సెంటర్‌, పాఠశాల) కోసం స్థలం కేటాయించాల్సి ఉంటుంది. నిర్ధేశించిన వెడల్పుతో రోడ్లకు స్థలం పోగా ఎకరానికి 24 గుంటలు మాత్ర మే ప్లాట్ల స్థలం మిగులుతుంది. అంతర్గత రోడ్లు 30 ఫీట్ల వెడల్పు, మేయిన్‌ రోడ్లు, అప్రోచ్‌ రోడ్లు కనీసం 40 ఫీట్ల వెడల్పుతో ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. డీటీసీపీ అనుమతి కోసం బెటర్మెంట్‌, డెవలప్‌ మెంట్‌ చార్జీల పేరిట భూమి విలువకు అనుగుణంగా ప్రభుత్వానికి ఫీజులు చెల్లించాలి. రెండున్నర ఎకరాల వరకు జిల్లా టౌన్‌ ఆండ్‌ కంట్రీ ప్లానింగ్‌ ఆఫీసర్‌ నుంచి లేఅవుట్‌ అనుమతి పొందాల్సి ఉంటుంటి. అటువంటి నిబంధనలు ఇక్కడ ఏమీ లేదు.

వసతులు ఉస్ కాకీ...


డీటీసీపీ లే అవుట్‌ వెంచర్‌లలో అన్ని రకాల వసతు లైన 33 ఫీట్ల రోడ్డు, బీటీ రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, ప్రహారీ, వాటర్‌ పైప్‌లైన్‌, సంప్‌, ఎలక్ర్టిసిటీ, వీధి లైట్లు, ఓపెన్‌ జిమ్‌, వాలీబాల్‌, షటీల్‌ కోర్టులు, పార్కు, చిల్డ్రన్స్‌ ప్లే ఏరియా, రోడ్డుకు ఇరువైపుల చెట్లు, స్పాట్‌ రిజిస్ర్టేషన్‌ వంటి సౌకర్యాలు వెంచర్లలో కల్పించాలి. ఇలాంటి సౌకర్యాలు వెంచర్‌లలో ఉంటేనే ప్లాట్లు విక్రయించాలి. ప్రస్తుతం అడేగామ బీ శివారం లో వెలిసిన ఈ వెంచర్‌లో ఎక్కడ పై నిబంధనలు అమలు కావడం లేదు. 20 ఫిట్లు రోడ్లు వేసి, ఫేక్ పత్రాలు చూపుతూ ప్లాట్లను అమాయకులకు అంట గడుతూ రియల్టర్లు మోసాలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు.
Comments
 -Advertisement-