బైక్, ఎడ్ల బండి ఢీ... ప్రమాదంలో ఎద్దు, ఓ బాలుడు మృతి
By
Vaasthava Nestham
• ప్రమాదంలో కొడుకు మృతి, తండ్రికి తీవ్ర గాయాలు
• పెంబి మండలములో ఘటన
వాస్తవ నేస్తం,నిర్మల్: బైక్, ఎడ్ల బండి ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఎద్దు మృతి చెందగా బైక్ పై వెళ్తున్న ఒక్కరు మృత్తి చెందగా మరొక్కరికి తీవ్రగాయాలైన ఘటన నిర్మల్ జిల్లా పెంబి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని సెట్ పల్లి గ్రామానికి చెందిన పవర్ పవర్ రాజు తన కొడుకైన అఖిల్ ను బైక్ పై ఎక్కించుకొని పెంబి నుండి సెట్ పల్లికి వెళుతున్న క్రమంలో ఎడ్ల బండిని ఢీకొనగా ఆక్కడిక్కడే ఎద్దు మృతి చెందింది. పవర్ రాజు, కొడుకు అఖిల్ కు తీవ్ర గాయాలు అయ్యారు. హాస్పిటల్ తరలిస్తున్న క్రమంలో మార్గ మధ్యలో అఖిల్ మృతి చెందాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments