-Advertisement-

ఆదివాసి ప్రజలు అభివృద్ధి చెందాలి: జిల్లా ఎస్పీ గౌష్ ఆలం

Vaasthava Nestham

- ప్రతి ఒక్కరూ గంజాయి నిర్మూలనకు కృషి చేయాలి
- సిరిచెల్మ గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం 
- రోటరీ క్లబ్ సహకారంతో దుప్పట్ల పంపిణీ


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: ఆదివాసి ప్రజలు అభివృద్ధి చెందాలి అని, గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో శనివారం మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ముందుగా గ్రామ ప్రజలు సాంప్రదాయ డప్పు వాయిద్యాల నడుమ జిల్లా ఎస్పీకి, ఉట్నూర్ ఏఎస్పీ కి ఘన స్వాగతం పలికారు. ఎస్పీ, ఏఎస్పీలు అంబేద్కర్, కొమరం భీం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పాఠశాల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి ప్రదర్శించిన విద్యార్థులకు లగత బహుమతులు అందజేశారు. పోలీసు కల జాత బృందంచే గంజాయి వల్ల కలుగు అనార్థాలు, గంజాయి వల్ల యువత పై ప్రభావాలు, రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి చేయు జాగ్రత్తలు, ప్రస్తుత సమాజంలో సైబర్ క్రైమ్ బారిన మోసపోకుండా జాగ్రత్తలపై కళా ప్రదర్శనలు నిర్వహించారు. డిపీఆర్ఓ ఆధ్వర్యంలో సాంస్కృతిక శాఖ బృందంచే చదువు ప్రాముఖ్యత, ఆరోగ్యం ఆవశ్యకతను వివరించారు. జిల్లా ఎస్పీ గౌష్ ఆలం మాట్లాడుతూ... గంజాయి యువత యొక్క భవిష్యత్తును నాశనం చేస్తుందని, గంజాయి పండించడం వల్ల ప్రభుత్వ ప్రయోజనాలు లభించమని తెలియజేశారు. మత్తు పదార్థాలు మాదకద్రవ్యాలను సేవించడం ద్వారా సమాజంలోని చెడును ప్రారంభించడం జరుగుతుందని దానిని అరికట్టడానికి తల్లిదండ్రులు పెద్దలు కృషిచేయాలని సూచించారు. ఆదివాసి ప్రజలు మారుమూల గ్రామ ప్రజలు వైద్య సేవలను విరివిగా వినియోగించుకుంటూ ఆరోగ్యంగా జీవించాలని కోరుకున్నారు.
Vaasthava Nestham

ఎలాంటి సమస్యలకైనా ప్రభుత్వ అందించే వైద్యశాలలను సంప్రదించాలని చికిత్స తీసుకొని వ్యాధిని నయం చేసుకోవాలని తెలియజేశారు. ఈ మెగా మెడికల్ క్యాంపు అనంతరం ఆదివాసి ప్రజలకు దుప్పట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడ, సిరికొండ మండలాలకు చెందిన ఆదివాసి ప్రజలు పాల్గొన్నారు. మెడికల్ క్యాంపు నందు వైద్య సేవలతో పాటుగా ఉచితంగా మందులను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ డిఎస్పి సిహెచ్ నాగేందర్, సైబర్ క్రైమ్ డిఎస్పి హసిబిల్లా, సిఐ భీమేష్, ఎస్సైలు తిరుపతి, శ్రీకాంత్, మహేందర్, రోటరీ క్లబ్ సభ్యులు అనిత, చైత్ర, ఫణిందర్, వైద్య బృందం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Comments
 -Advertisement-