తీసుకున్న అప్పు తీర్చమంటే.. యువతిపై సర్జికల్ బ్లేడ్‌తో దాడి
By
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,నిర్మల్: తీసుకున్న అప్పు తీర్చమని అడుగుతే ఓ యువకుడు అప్పు ఇచ్చిన యువతిపై సర్జికల్ బ్లేడుతో దాడి చేసిన ఘటన నిర్మల్ జిల్లాలో కలకలం సృష్టించింది. జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం యువతిపై సర్జికల్ బ్లేడ్‌త్ ఓ యువకుడు దాడి చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని సోఫీనగర్‌లో ఉంటున్న సంతోష్, దివ్య అనే యువతి వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న అప్పు తీర్చాలని పలుమార్లు సంతోష్‌ను దివ్య నిలదీసింది. డబ్బులు చెల్లించకపోగా సంతోష్ కోపం పెంచుకున్నాడు. శుక్రవారం దివ్య అప్పు విషయం అడిగేందుకు సోఫీనగర్‌లోని సంతోష్ వద్దకు వెళ్లింది. అప్పటికే కోపంతో ఉన్న సంతోష్ డబ్బులు ఇవ్వను అని తెగేసి చెప్పడంతోపాటు తన వద్ద ఉన్న సర్జికల్ బ్లేడ్‌తో దివ్య గొంతుపై ఒక్కసారిగా దాడిచేసాడు. యువతిపై దాడి చేసి నిందితుడు వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో తీవ్ర రక్తస్రావమైన దివ్యను స్థానికులు గమనించి వెంటనే జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
Comments