చెరువులో స్నానానికి వెళ్లి... మృత్యు ఒడిలోకి
By
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,బోథ్: చెరువులోకి స్నానానికి వెళ్లి ఓ వ్యక్తి ఈత రాక చెరువులో మునిగి మృతి చెందాడు. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని చంద్రపూర్ సమీపంలోని డోంగర్గావ్ గ్రామానికి చెందిన బర్దావల్ రామేశ్వర్ మండలంలో తన కుటుంబ సభ్యులతో కలిసి పశువుల కాపరిగా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.
బర్దావల్ రామేశ్వర్ శుక్రవారం ఉదయం సాబ్లే అమర్ సింగ్, పండరి అంకుశ్ లతో కలిసి మండలంలోని కంటేగాం చెరువుకి స్నానం చేయడానికి వెళ్లారు. రామేశ్వర్ చెరువులోని లోతైన ప్రాంతంలోకి వెళ్లడంతో ఈతరాక నీటిలో మునిగిపోయాడు. అక్కడే ఉన్న అమర్ సింగ్, అంకుశ్ లకు సైతం ఈత రాకపోవడంతో వారు అతన్ని కాపాడలేకపోయారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Comments