స్వప్న జిన్నింగ్ మిల్లులో కార్మికుడు మృతి
By
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రం లోని స్వప్న జీన్నింగ్ మిల్లులో పనిచేస్తున్న ఓ కార్మికుడు మంగళవారం ప్రమాదవ వశాత్తు మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఉన్నాయి. మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఆరే శంకరాం గైక్వాడ్ (55) అనే కార్మికుడు బతుకు దెరువు కోసం ఆదిలాబాద్ కు వచ్చాడు. జిల్లా కేంద్రంలోని ఓ జిన్నింగ్ మిల్లులో కొన్నేళ్లుగా కార్మికుడిగా పని చేశాడు. అక్కడ పని మానుకొని రెండు నెలల క్రితమే బోథ్ లోని స్వప్న జిన్నింగ్ మిల్లులో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. నిత్యం మాదిరిగానే పత్తి ఘటన్లు ఫిట్టింగ్ లోడింగ్ చేస్తున్న నేపథ్యంలో అత్యధిక బరువు ఉన్న పత్తి ఘటన్ తల పై పడడంతో ఒక్కసారిగా అతను నేలకూలిపోయాడు. చుట్టూ ఉన్న కార్మికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యాధికారి చైతన్య తెలిపారు. ఇంటి పెద్ద దిక్కు మరణించడంతో విషాదం నెలకొంది. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇంటి యజమాని మరణంతో తాము దిక్కు లేనివారిగా మిగిలామని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఆవరణలో బోరున విలపించడంతో అందర్నీ కలచి వేసింది. నిరుపేద బాధిత కుటుంబానికి స్వప్న జిన్నింగ్ మిల్లు యాజమాన్యం న్యాయం చేయాలని తోటి కార్మికులు కోరుతున్నారు.
Comments