మర్మాంగాలపై బండరాళ్లతో కొట్టి దారుణ హ*త్య
By
Vaasthava Nestham
• నిర్మల్ జిల్లా చిట్యాల గ్రామంలో ఘటన
• విచారణ చేస్తున్న పోలీసులు
వాస్తవ నేస్తం,నిర్మల్: నిర్మల్ రూరల్ మండలం చిట్యాల గ్రామంలో దారుణం జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఓ బాలుని మర్మాంగాలపై బండరాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. చిట్యాల గ్రామానికి చెందిన అడ్డిగ రిషి(14) అనే బాలుడిని గ్రామ చెరువు శివారులో గుర్తు తెలియని వ్యక్తులు దారుణహత్య చేశారు. ఈరోజు (శనివారం) ఉదయం బహిర్భూమికి వెళ్ళిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ జానకి షర్మిల పరిశీలించారు. డాగ్ స్క్వాట్స్, క్లూస్ టీమ్ రప్పించి ఆధారాలు సేకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామస్తుల సమాచారం మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. హత్యకు పాల్పడ్డ నిందితులను వెంటనే పట్టుకుంటామని తెలిపారు. బాలుడు స్థానికంగా ఓ కళ్ళు బట్టిలో పనిచేసేవాడు.
Comments