-Advertisement-

Breaking News : కేశవపట్నం గ్రామంలో ఉద్రిక్తత..!

Vaasthava Nestham

- కేశవపట్నం గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన అటవీ అధికారులు
- కార్డెన్ సెర్చ్'లో పలు ఇళ్లలో దొరికిన కలప దుంగలు, ఫర్నిచర్
- అటవీశాఖ అధికారులపై ఎదుగురు తిరిగిన స్థానికులు.?
- అటవీ శాఖకు సంబంధించిన ఓ వాహనం పై దాడి
- అటవీ శాఖ అధికారికి స్వల్ప గాయాలు..?
- ఉద్దేశపూర్వకంగానే అధికారులు ఇళ్లల్లోకి చొరబడ్డారని గ్రామస్తుల ఆరోపణ 


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: ఇచ్చోడ మండలంలోని కేశవపట్నం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం తెల్లవారుజామున ఫారెస్ట్ అధికారులు గ్రామంలో కార్డెన్ సెట్స్ నిర్వహించారు. ఈ కాటన్ సెర్చ్ లో గ్రామంలో పలు ఇండ్లలో టేకు దుంగలు, ఫర్నిచర్ పట్టుకున్నారు. పట్టుబడిన టేకు దుంగలను ఫారెస్ట్ అధికారులు ఆధీనంలోకి తీసుకునే క్రమంలో అడవి అధికారులపై గ్రామస్తులు తిరగబడినట్లు తెలుస్తోంది.
Vaasthava Nestham Telugu Daily



దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు భద్రత బలగాలతో కేశవపట్నం గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో అటవీశాఖ అధికారులు ఉద్దేశ్యకపూర్వకంగానే ఇళ్లల్లోకి చొరబడి కార్డెన్ సెర్చ్ నిర్వహించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పాత ఫర్నిచర్ ను పట్టుకున్నారని గ్రామస్తుల పేర్కొంటున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. 


Comments
 -Advertisement-