illegal Sand business : సిరులు కురిపిస్తున్న ఇసుక అక్రమ రవాణా..!
Illegal sand business
What is illegal sand mining
Sand mining business
Types of sand mining
By
Vaasthava Nestham
• అక్రమంగా ఇసుక నిల్వలు..
• మండలంలో పదుల సంఖ్యలో ఇసుక డంపులు
• అక్రమార్కులకు అధికారుల అండదండలు..!?
• పట్టించుకొని మైనింగ్, రెవెన్యూ ఆధికారులు
• సొమ్ముచేసుకుంటున్న వ్యాపారులు
• అధికారుల అడ్డు లేకపోవడంతో మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరబూస్తున్న అక్రమ ఇసుక వ్యాపారం
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: వ్యాపారులు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. అందినకాడికి దొచేస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తు న్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. పెనుగంగా తీరం నుంచి నిత్యం వాహనాల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రకృతి సంపదను దోచుకుని ఇసుక వ్యాపారులు కాసులు గడిస్తున్నారు. మండల కేంద్రంలోని పలు చోట్లలో బహిరంగంగానే ఇసుక డంపులు వ్యాపారులు నిలువ చేస్తున్నారు.
ఇచ్చోడ కేంద్రంగా.. పదుల సంఖ్యలో ఇసుక డంపులు
ఇచ్చోడ మండల కేంద్రంగా అక్రమ ఇసుకను వ్యాపారులు నిల్వలు చేస్తున్నారు. కృత్రిమ కొరతలు సృష్టిస్తున్నారు. మండల కేంద్రానికి చెందిన కొందరు వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తూ గృహ నిర్మాణాల వినియోగదారులకు నిలువు దోపిడీకి గురి చేస్తున్నారు. ఇసుక అక్రమంగా నిలువ ఉంచిన ప్రదేశాలు తెలిసి కూడా అధికారులు పట్టించుకోకపోవడంతో అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మైనింగ్, రెవెన్యూ శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఇసుక వ్యాపారులు ప్రకృతి సంపదను కొల్లగొట్టి లక్షల్లో దండుకుంటున్నారు. ఇచ్చోడ, బోథ్, నేరడిగొండ, బజార్ హత్నూరు, సోనాల, గుడిహత్నూరు మండలలో పలు అభివృద్ధి, నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ మండలాలకు ప్రధాన కేంద్ర బిందువు అయిన ఇచ్చోడలో కొందరు వ్యాపారులు ఇసుకను అక్రమంగా రవాణా చేసి మండల కేంద్రంలోని పలు ప్రదేశాల్లో ఇసుక డంపులు చేసి ఇసుకను విక్రయించి పెద్ద మొత్తంలో కాసులు కూడా పెట్టుకుంటున్నారు. అక్రమ ఇసుక వ్యాపారులకు మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు అడ్డు చెప్పకపోవడంతో అక్రమ ఇసుక రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరబూస్తోందని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని నిబంధనలు ఉన్న అధికారులు మామూలుగా తీసుకుంటూ గాలికి వదిలేస్తున్నారని ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు ఇసుక అక్రమ రవాణాను అరికట్టి ప్రకృతి సంపదలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
Comments