Local body elections : గ్రామాల్లో పంచాయతీ పోరు..!
By
Vaasthava Nestham
- ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ రెడీ
- మొదట ఉంగరం.. రెండవది కత్తెర..
- మిగితా గుర్తులు సిద్ధం..
- బీసీ రిజర్వేషన్ల ప్రకటన రాగానే ముందుకు
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ బ్యూరో: పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఓటరు జాబితా విడుదల, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయడం వంటివి పూర్తయ్యాయి. ఎన్నికల నిర్వహణకు అధికారులు, సిబ్బంది నియామకం చేపట్టారు. తాజాగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమీషన్ గుర్తులను ప్రకటించింది. బ్యాలెట్ ముద్రణకు జిల్లా స్థాయిలో సన్నాహాలు కూడా చేస్తున్నారు. సర్పంచులు, వార్డు సభ్యుల నామినేషన్లు ప్రారంభమయ్యే నాటికి 50 శాతం బ్యాలెట్ పేపర్లు ముద్రించే విధంగా చర్యలు చేపడు తున్నారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఇటీవలనే నోడల్ అధికారులను నియమించిన విషయం తెలిసిందే. సర్పంచుల పదవీ కాలం 2024 ఫిబ్రవరి 1 తో ముగియడంతో వారి స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. Mptc Zptc elections కుల గణన సర్వే కూడా పూర్తి కావడంతో ఎన్నికల ఏర్పాట్లను ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేస్తోంది. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నిక లను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించేలా అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఇందులో భాగంగా సర్పంచ్ కు గులాబీ రంగు, వార్డు సభ్యులకు తెల్లరంగు బ్యాలెట్ పేపర్ ఉపయోగించనున్నారు. జిల్లాలో మొత్తం 20 మండలాలు, గ్రామ పంచాయ తీల 473, వార్డులు 3870 ఉన్నాయి.
ముందస్తుగానే ప్రారంభమైన ముద్రణ..
స్థానిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బ్యాలెట్ పేపర్ ముద్రణ ముందస్తుగానే ప్రారంభిస్తున్నట్లు తెలిసింది. జీపీ ఎన్నికలు పార్టీ రహితంగా నిర్వహిస్తారు. సర్పంచ్తో పాటు వార్డు సభ్యులకు ఓటింగ్ నిర్వ హిస్తారు. ఒక్కో ఓటరు రెండు ఓట్లను వేయాల్సి ఉంటుంది. ఒకటి సర్పంచ్ కు, మరొకటి తన పరిధిలో ఉన్న వార్డు సభ్యునికి ఓటు వేయాలి. పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థుల పేర్లు వరుస క్రమంలో ప్రకటిస్తారు. అక్షర క్రమంలో అభ్యర్థుల పేర్లు ప్రకటించి.. మొదటి అభ్యర్థికి మొదటి గుర్తు, రెండో అభ్యర్థికి రెండో గుర్తు విధానాన్ని అవలంభిస్తారు. వార్డు సభ్యులకూ ఇదే విధానాన్ని అనుసరిస్తారు. Local body elections 2025 దీని కోసం సర్పంచులు, వార్డు సభ్యులకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లను ముద్రించారు. వార్డులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో ఎక్కువ బ్యాలెట్ పేపర్లను ముద్రించాల్సి ఉంటుందనే ఉద్దేశంగా ముందస్తుగా బ్యాలెట్ పేపర్లను ముద్రించి పెట్టుకుంటున్నట్లు సమాచారం. బ్యాలెట్ పేపర్లను 3, 5, 8, 10, 15, 20, 25 ఇలా గుర్తులు ఉండే విధంగా ప్రింట్ చేశారు. వీటిని జిల్లా కేంద్రంలో భద్రపరుస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే ఆయా మండలాలకు వీటిని పంపిణీ చేస్తారు. అక్కడ స్థానికంగా పోటీ చేసే అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా వీటిని వినియోగించుకుం టారు.
సర్పంచ్ అభ్యర్థులకు 30 గుర్తులు..
అభ్యర్థులకు సరిపోయేలా బ్యాలెట్‌లో గుర్తులు
సర్పంచ్ అభ్యర్థికి మొదటి గుర్తు ఉంగరం, రెండో గుర్తు కత్తెర, ఆ తర్వాత బ్యాట్, ఫుట్‌బాల్, లేడీ పర్సు, టీవీ రిమోట్, టూత్ పేస్టు, స్పానర్, చెత్త డబ్బా, బ్లాక్ బోర్డు, బెండకాయ, కొబ్బరి తోట, వజ్రం, బకెట్లు ఉంటాయి. మొత్తం 30 మంది అభ్యర్థులకు సరిపోయేలా బ్యాలెట్ పేపర్‌ను ముద్రించారు. Sarpanch elections- 2025
వార్డు సభ్యులకు 20 గుర్తులు ...
వార్డు సభ్యులకు ప్రత్యేకంగా సింబల్స్ ఏర్పాటు చేసి ముద్రించారు. వార్డు సభ్యులకు మొదటి గుర్తుగా గౌను, గ్యాస్ స్టవ్, స్టూల్, గ్యాస్ సిలిండర్, బీరువా, ఈల, కుండ, డిష్ యాంటీనా, గరాటా, మూకుడు, ఐస్ క్రీం, గాజు గ్లాసులను మొత్తం 20 గుర్తులుగా ఉండే విధంగా బ్యాలెట్ పేపర్‌ను ముద్రించారు. రిజర్వేషన్లు ఏ విధంగా ఉండనున్నాయి.. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అంటూ గ్రామాల్లో సర్పంచ్ కు పోటీ చేసే ఆశవాహులు ఎదురుచూస్తున్నారు.
Comments