-Advertisement-

Sevaalaal Maharaj : ఆంగ్ల భాషలో సంత్ సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్ర పుస్తకం

Sevalal Maharaj birth Date Sevalal Maharaj wife name Sevalal Maharaj birth place Sevalal Maharaj death place Sevalal Maharaj Wikipedia Sevalal Maharaj
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: ఇంగ్లీషు భాషలో తొలి సారిగా సంత్ సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్ర పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కు చెందిన రచయిత 
ఎఎస్ఎన్ మూర్తి రచించి బంజారా సమాజానికి అంకితం చేశారు.
మూర్తి రచించిన సంత్ సేవా లాల్ మహారాజ్ పుస్తకాన్ని 
సేవాగడ్ టు పోహారాగడ్ అని నామకరణం చేశారు. ఇప్పటి వరకు సంత్ సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాలు ఇంగ్లీషు భాషలో ప్రచురణ కాలేదు. దేశమంతటా బంజారా సమాజ ప్రజలు ఒకే భాష "గోర్ బోలి లో మాట్లాడుకుంటారు. లిపి లేని కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో వారు తెలుగు లోను, కర్నాటకలో కన్నడ భాషలోను ఒరిస్సా రాష్ట్రంలో ఒడియా లోను మహారాష్ట్రలో మరాఠీ‌ లోను, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రంలో హిందీలోను అలాగె ఏ రాష్ట్రానికి చెందిన వారు, ఆ భాషలో రాసుకుంటారు. జాతీయ ,అంతర్జాతీయ స్థాయిలో సంత్ సేవాలాల్ మహారాజ్ కు మంచి గుర్తింపు లభించడంతో స్వదేశంలోను, విదేశాల్లోనూ బంజారా ప్రజానీకం చదువు కునేందు వీలుగా ఉండేటట్లు సంత్ సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్రను ఇంగ్లీషు భాషలో రచించారు. అంతేకాకుడా భగవద్గీతను గోర్ బోలి భాషలో గోర్ బంజారా భగవద్గీత సంగీత రూపకం ద్వారా ప్రాచుర్యం కలుగు చేస్తూ కృషి చేయడం అభినందనీయని సంత్ సేవా లాల్ మహారాజ్ ఛారిటీబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కొర్రా జగన్నాథరావు అన్నారు. మూర్తి బంజారా జాతికి చెందకపోయినా బంజారా సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో భగవద్గీత జ్ఞానాన్ని బంజారా ప్రజలకు గోర్ బోలి భాషలో సంగిత రూపంగా మలచి మొబైల్స్ ఫోన్ ద్వారా,యు ట్యూబ్ ద్వారా వినూత్నంగా అందిస్తుండడం విశేషం. భగవద్గీత ప్రాచుర్యం కోసం పుస్తకం కొనడం, చదవడం వంటి అవసరాలు లేకుండా చేశారు. ఈ ప్రేరణాత్మక "గోర్ బంజారా భగవద్గీత సంగీత రూపకం" ప్రాజెక్టుకు మూర్తి ఉదారంగా నిధులు సమకూర్చారు. ప్రతిభావంతులైన తమ కుటుంబ సభ్యులైన శ్రీమతి రజని శ్రీ పూర్ణిమ (గాయని) మరియు శ్రీమతి రమణి హైమావతి (సంగీత దర్శకురాలు) సహాయంతో దీనిని సాకారం చేశారు. సంత్ సేవాలాల్ మహారాజ్ వారి భోదనలకు ప్రపంచ ప్రాచుర్యం కల్పించుటకు " సేవాగడ్ టు పోహరాగడ్" అనే పుస్తకాన్ని ఆంగ్లంలో రచించానని వారు తెలిపారు.
Comments
 -Advertisement-