-Advertisement-

జల్సాలకు అలవాటు పడి.. గ్యాంగుగా ఏర్పడి..

Vaasthava Nestham
• కాదు అన్నందుకే కడ తేర్చారు
• ఆదిలాబాద్ పట్టణంలో యువకుని దారుణ హ*త్య 
• హ*త్య కేసును చేదించిన పోలీసులు 
• వివరాలు వెల్లడించిన డీఎస్పీ జీవన్ రెడ్డి

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: వారు జల్సాలకు అలవాటు పడ్డారు.. గ్యాంగ్ గా ఏర్పడుదామన్నారు.. దానికి ఓ యువకుడు ఒప్పుకు పోవడంతో ఆ యువకుడ్ని దారుణంగా హత్య చేశారు. పట్టణంలో సోమవారం రాత్రి ఓ యువకుని హత్య కలకలం రేపింది. హత్య చేసిన నిందితులను పోలీసులు ఆరు గంటల్లోపే పట్టుకున్నారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో హత్యకు చెందిన వివరాలు డీఎస్పీ జీవన్ రెడ్డి వెల్లడించారు. ఆదిలాబాద్ ఆదిలాబాద్ పట్టణానికి చెందిన గోవిందు కార్తీక్, చెల్కల ప్రణీత్, దావుల సాయి కిష్ణ అనే ముగ్గురు యువకులు జల్సాలకు తిరుగుతూ అసాంఘిక కార్యకలాపాలకు, నేరాలకు పాల్పడే వారని, ఈ క్రమంలోని ఒక గ్యాంగ్ గా ఏర్పడి నేరాలను చేయాలనే ఒక దురుద్దేశంతో కొమ్మవార్ రవితేజ తమతో కలసి నేరాలకు కలిసి పాల్పడదామని ఆలోచనతో అతనిని ప్రేరేపించడంతో అతను నిరాకరించడంతో సోమవారం రాత్రి కొమ్మవార్ రవితేజ హత్య చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
 -Advertisement-

మృతుని భార్య ఫిర్యాదు మేరకు నిందితులను పట్టుకుని అరెస్టు చేసినట్లు డిఎస్పి పేర్కొన్నారు. నిందితులు ముగ్గురు సోమవారం రాత్రి మద్యం సేవించి మద్యం మత్తులో ఇంటికి తిరిగి వెళుతున్న క్రమంలో కొమ్మవర్ రవితేజ ను దారి మధ్యలో అడ్డగించి తమతో గ్యాంగులో తిరగమని ప్రేరేపించడంతో అతను నిరాకరించడంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. నిందితులు ముగ్గురు కొమ్మవార్ రవితేజ ను కత్తితో దారుణంగా హత్య చేశారు. నిందితులు గోవిందు కార్తీక్, చెల్కల ప్రణీత్ నేరాలకు పాల్పడడంతో ఇప్పటికే పలు కేసులు నమోదు చేసి ఉన్నట్లు డిఎస్పి తెలిపారు. నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి
కత్తి, మూడు మొబైల్ ఫోన్లను, ఒక ద్విచక్ర వాహనం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Comments