-Advertisement-

అయ్యో పాపం.. చుట్టపు చూపుగా వచ్చి...

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఇచ్చోడ: చుట్టపు చూపుగా వచ్చి భార్య భర్తల్లో, భార్య మృతి చెందాగా భర్తకు తీవ్ర గాయాలైన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై తిరుపతి తెలిపిన వివారాల ప్రకారం.. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జీవితి కి చెందిన 
అంకుస్ గాయక్వాడ్, భార్య జ్యోతి పిల్లలు ఆదిప్, అనన్యతో కలిసి శుక్రవారం రాత్రి ఇచ్చోడ మండలంలోని జున్ని గ్రామంలోని తన బంధువుల ఇంటి వద్దకు చుట్టపు చూపుగా వెళ్తున్న క్రమంలో జాతీయ రహదారి-44 జున్ని క్రాస్ రోడ్ వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతున్న క్రమంలో గుర్తుతెలియని కారు అంకుస్, జ్యోతి లను ఢీకొనడంతో జ్యోతి అక్కడికక్కడే మృతి చెందగా అంకుష్ కు తీవ్ర గాయాలయ్యాయి.గాయపడిన అంకుస్ ను చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.
Comments
 -Advertisement-