తప్పు చేసినవారికి కఠిన శిక్ష తప్పదు: ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి ఎస్పీ జానకి షర్మిల
By
Vaasthava Nestham
• మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితులు కేసు నమోదు, అరెస్ట్
• శాంతి భద్రతల విఘాతం కల్గించే వారిపై ప్రత్యేక నిఘా
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: తప్పు చేసిన వారికి కఠిన శిక్ష తప్పదని ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి ఎస్పీ జానకి షర్మిల అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. వారం రోజుల క్రితం ఆదిలాబాద్ పట్టణంలోని ఓ కాలనీకి చెందిన మైనర్ బాలిక పై జరిగిన అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్సీ తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి ఎస్పీ జానకి షర్మిల శుక్రవారం రాత్రి బాలిక కుటుంబ సభ్యులతో రిమ్స్ హాస్పిటల్ లో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మైనార్ బాలికను అత్యాచారం చేసిన ఇంగోలే అనిల్, ఇంగోలే గంగాధర్, దుప్పాత్రే సుష్మ లను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. సోషల్ మీడియాలో ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతూ శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరు సమానమే అని తప్పు చేసిన వారికి కఠిన శిక్ష తప్పదని అన్నారు. ఎస్పీతో పాటుగా ఆదిలాబాద్ డిఎస్పి జీవన్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి పోతారం శ్రీనివాస్, సిబ్బంది, తదితరులు ఉన్నారు.
Comments