విద్యార్థిని చితకబాదిన వార్డెన్
By
Vaasthava Nestham
• ఇచ్చోడ మండల కేంద్రంలోని గోల్డెన్ లీఫ్ స్కూల్లో ఘటన
• వార్డెన్ పై కేసు నమోదు
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి మంచి పౌరులుగా తీర్చిదిద్దేవ్వాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉన్నప్పటికీని కొందరు ఉపాధ్యాయులు, కొన్ని ప్రైవేటు పాఠశాల యజమాన్యాలు విద్యార్థుల పైన కర్కశంగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని ప్రైవేటు పాఠశాలలలో హాస్టల్ నిర్వహించడానికి అనుమతులు ఉన్నా..? లేకున్నా..? హాస్టల్లు నిర్వహిస్తూ విద్య పేరుతో సొమ్ము చెకుంటున్నారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని ఓ స్కూల్లోని హాస్టల్లో విద్యార్థిని వార్డెన్ చితకబాదిన శుక్రవారం జరిగింది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని గోల్డెన్ లీఫ్ స్కూల్లో విద్యా అభ్యసించే విద్యార్థిని ఆ పాఠశాల హాస్టల్ వార్డెన్ చితకబాదినట్లు తెలిపారు. సంబంధిత విద్యార్థి తండ్రి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వాడెన్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
అధికారుల తీరుపై విమర్శలు...
ఇచ్చోడ మండల కేంద్రంలోని పలు స్కూల్లకు అనుమతులు లేకున్నా, ఒకవేళ అనుమతులు ఉన్నా కూడా కేవలం ప్రైమరీ స్థాయికి అనుమతులు ఉండి సెకండరీ స్థాయి క్లాసులు నిర్వహిస్తున్న కూడా అధికారులు పట్టించుకోకపోవడంతో అధికార తీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఓ ప్రైవేట్ స్కూల్లోనైతే ఏకంగా జిల్లా కేంద్రంలో ఉన్న స్కూల్ అనుమతులతో ఇచ్చోడ మండల కేంద్రంలో 10వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ప్రైవేటు పాఠశాలల్లో హాస్టల్ నిర్వహించాలంటే అనుమతులు తప్పకుండా తీసుకోవాలి కానీ అదేమీ లేకుండా పలు స్కూల్లలో హాస్టల్ నిర్వహిస్తున్నారు. ఇట్టి ప్రైవేట్ పాఠశాలలపై సంబంధిత విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అధికారుల తీరుపైన విమర్శలు వెలివెత్తుకున్నాయి.
Comments