గుండెపోటుతో అధ్యాపకుడు మృతి
By
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఇచ్చోడ: గుండెపోటుతో అధ్యాపకుడు మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇచ్చోడ మండలంలోని కోకస్ మన్నూర్ గ్రామానికి చెందిన శాంతపురం దేవరాజ్ (39) బోథ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ లో గెస్ట్ ఇంగ్లీష్ అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. మోడల్ స్కూల్ లో విద్యార్థులకి పాఠాలు బోధించిన అనంతరం బయటకీ రాగానే అకస్మాత్తుగా గుండె పోటు వచ్చింది. మోడల్ స్కూల్ అధ్యాపక బృందం గమనించి వెంటనే హాస్పిటల్ కి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందాడు. యువ అధ్యాపకుడి మృతితో మోడల్ స్కూల్, స్వగ్రామం కోకస్ మన్నూర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Comments