-Advertisement-

కోకస్ మన్నూర్'లో అక్రమ వెంచర్..!?

Real estate business in india Real estate business ideas Real estate business plan Real Estate Business salary Real Estate Business in Hindi
Vaasthava Nestham

• అనుమతులు లేకుండానే ఏర్పాటు..
• అనుమతులు లేకున్నా.. అనుమతులు ఉన్నాయంటూ ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నం
• ప్రభుత్వ ఆదాయానికి గండి
• పల్లెలపై కన్నేసిన వెంచర్ మాఫియా
• కనుమరుగు కానున్న వ్యవసాయ భూములు..!
• పట్టించుకోని అధికారులు


వాస్తవ నేస్తం,ఇచ్చోడ: అక్రమ వెంచర్లు పట్టణాల ల్లోనే కాదు.. పల్లెలకు కూడా పాకాయి.. తమ పర పతి, పలుకుబడి తో కొందరు మాజీ ప్రజా ప్రతినిధులు స్థానిక జీపీ ల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకో కుండానే అక్రమంగా వెంచర్లు ఏర్పాటు చేస్తూ ప్రభు త్వ ఆదాయానికి గండికొడుతున్నారు. అనుమతులు ఉన్నాయంటూ బురుడి కొట్టిస్తూ కొనుగోలుదారులకు మోసాలకు గురి చేస్తున్నారు. ఇచ్చోడ మండలంలోని కోకస్ మన్నూర్ గ్రామంలో ఓ పార్టీకి చెందిన మాజీ ప్రజా ప్రతినిధి అక్రమంగా వెంచర్ ను ఏర్పాటు చేశాడు. గ్రామ సమీపంలోని మసీదు వెనుక గల సర్వే నంబర్-86 లో ఒక ఎకరం,13 గంటల విస్తీర్ణంలో ఎలాంటి అనుమతులు లేకుండానే వెంచర్ ఏర్పాటు చేశాడు.

నిబంధనల ప్రకారం...


వ్యవసాయ భూములను వెంచర్లుగా ఏర్పాటు చేయా లంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం మొదట వాటిని నివాస స్థలాలుగా మార్చుకోవాలి. రుసుము చెల్లించి నాలా కన్వర్షన్ తో పాటుగా డీటీసీపీ, గ్రామపంచా యతీ నుండి లే అవుట్ అనుమతి పొందాలి. అంత ర్గత రోడ్ల వెడల్పు 33 ఫీట్లు ఉండాలి. ఇవేమి లేకుం డానే వెంచర్ లో ఎర్ర మొరం తో తాత్కాలిక చిన్న, చిన్న రోడ్లు వేసి ప్లాట్లు విక్రయించడానికి తెర లేపాడు.

ఎలాంటి అనుమతులు లేవు
- ఆడే మహేందర్, పంచాయతీ కార్యదర్శి కోకస్ మన్నూర్
 

కోకస్ మన్నూర్ గ్రామంలో వెలసిన వెంచర్ కు గ్రామపంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు లేవు. అనుమతి కోసం రియాల్టర్ దరఖాస్తు చేసుకోలేదు. ఇందులో ఎవరు కూడా ప్లాట్లను కొనుగోలు చేయకూడదని గ్రామస్తు లకు చెప్పినాము. ఆదేశాలు ఉల్లంఘించి ఇండ్ల నిర్మాణాలు చే వాటిని కూల్చివేస్తం. ఏదైనా లే ఔట్‌లో స్థలం కొనుగోలు చేసే ముందు దానికి ప్రభుత్వ అనుమతి ఉందా లేదా అని తప్పనిసరిగా తెలుసుకోవాలి. రహదారులు, ఇతర మౌలిక వసతులు పరిశీలించి అన్ని నిబంధనల ప్రకారం ఉంటేనే ప్లాటు కొనాలి. అక్రమ లే ఔట్ ను సాగేతర భూమి కింద నమోదు చేయడం జరిగింది.
Comments
 -Advertisement-