-Advertisement-

గిరిజనేతరులకు మేము వ్యతిరేకం కాదు

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఇచ్చోడ: గిరిజనేతరులకు మేము వ్యతిరేకం కాదని ఆదివాసి నాయకులు అన్నారు. మండలంలోని మేడిగూడ రాయి సెంటర్ లో 33 గ్రామాల పటేల్, దేవరి, మహాన్ ల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పలు అంశాలు చర్చించినట్లు తుడుం దెబ్బ నాయకులు కొడప నగేష్ తెలిపారు. ఆదివాసులు గిరిజనేతరులకు వ్యతిరేకం కాదని అందరితో కలిసికట్టుగానే ముందుకు సాగుతున్నామన్నారు. కొందరు ఆర్టిఐ పేరుతో ఇచ్చోడ మండల కేంద్రంలో నిర్మితమవుతున్న ఇండ్లకు నోటీసులు ఇస్తున్నారని వారిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఏజెన్సీ ప్రాంతమైన ఇచ్చోడ మండలంలో గిరిజనుల ఆస్తులకు రక్షణ కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సార్మెడి మెస్రం శంభు, ఉప సార్మెడి కుమ్రం జ్యోతి రాం, మాజీ ఐటీడీఏ డైరెక్టర్ పెందుర్ తులసి రాం, పెందూర్ భీంరావ్, సిడాం లక్ష్మికాంత్, కోడుప జలై జాకు, సిడాం గంగారాం, కాత్లె రాము, తోడసం భింరావ్, సీడం గంగారాం, నాగోరవ్త, దితరులు పాల్గొన్నారు. 



Comments
 -Advertisement-