Chhatrapati Shivaji Maharaj birth anniversary celebration : గెరిల్లా యోధుడు ఛత్రపతి శివాజీ ఎందరికో స్ఫూర్తి
Shivaji Maharaj Jayanti date of death
Why do we celebrate Shivaji Jayanti
Who started Shiv Jayanti celebration
Shivaji Maharaj Quotes In
By
Vaasthava Nestham
• ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
వాస్తవ నేస్తం,ఇచ్చోడ: సనాతన ధర్మ పరిరక్షకుడు, గెరిల్లా యోధుడు ఛత్ర పతి శివాజీ మహారాజ్ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని వక్తలు అన్నారు. హిందూ సంప్రదాయాలను, సంస్కృ తిని కాపాడుకోవాలంటే శివాజీని ఆదర్శంగా తీసు కుని యువత అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. 16 ఏళ్లకే కత్తి అందుకున్న యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 395 వ జయంతి వేడు కలను బోథ్ నియోజక వర్గంలోని ఆయా గ్రామాల్లో గురువారం ఘనంగా జరుపుకున్నారు.
శివాజీ మహారాజ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువకులు, పెద్దలు,జై భవాని, జై జై శివాజీ మహా రాజ్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్, హిందూ వాహినీ , వివిధ పార్టీల నాయకులు, సంఘాల నాయకులు, ప్రముఖులు, యువతి, యువకులు, ఎత్తున పాల్గొన్నారు.
Comments