-Advertisement-

Deputy range officer : టైగర్ జోన్ డిప్యూటి రేంజ్ ఆఫీసర్ సస్పెండ్

Vaasthava Nestham

• పట్టుబడిన కలప అప్పగించినందుకు చర్యలు 
• సిరిచెల్మ కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని ఫారెస్ట్ ల్యాండ్ లో అనుమతులు లేకుండా బావులు తవ్వడం 
• పోడు భూముల రైతుల నుండి మామూళ్లు వసూలు చేసినట్లు ఆరోపణలు 


వాస్తవ నేస్తం,అదిలాబాద్ డెస్క్ : అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం సిరిచెల్మ కవ్వాల్ టైగర్ జోన్ డిప్యూటి అటవీ అధికారి గీరయ్య ( Deputy range officer ) సస్పెండ్ అయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. సిరిచెల్మ టైగర్ జోన్ పరిధిలోని సిరికొండ లో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలప దుంగలను గత కొన్ని రోజుల క్రితం డిప్యూటి రెంజ్ అధికారి గీరయ్య ( DRO )ఆద్వర్యంలో టైగర్ జోన్ అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. పట్టుకున్న టేకు కలప దుంగలను అప్పగించలేకపోయారు.
వివరాలను రిజిస్ట్రార్ బుక్ లో నమోదు చేయలేకపోవడం, వివరాలను దాచి పెట్టారు. దీనిపై బాసర జోన్ సీసీఎఫ్ శర్వానంద్ ఆద్వర్యంలో గత అయిదు రోజుల క్రితం సమగ్ర విచారణ చేపట్టారు. సదరు అధికారి టైగర్ జోన్ రేంజీ లో అవినీతికి పాల్పడుతున్నట్లు, కలప స్మగ్లర్ల తో కుమ్మక్కయి అక్రమ రవాణా కూ సహకరిస్తున్నట్లు, సిరిచెల్మ అటవీ పోడు భూమల రైతుల నుంచి మాముళ్ళు తీసుకున్నారని, ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా పోడు భూముల్లో సేద్యపు బావుల ను తవ్వించినట్లు అధికారిపై ఆరోపణలు సైతం ఉన్నాయి. సదరు అధికారి ని బాసర జోన్ సీసీఎఫ్ సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
 -Advertisement-