-Advertisement-

MLC elections : పట్ట భద్రుడ.. నీకో విన్నపం...!

Vaasthava Nestham

• ఓ పట్టభద్రుడా నువ్వు కూడా కాసులకు అమ్ముడుపోతున్నావా..!?

• నోటుకు ఓటు... నీ భవితకు చేటు
• నీ ఓటును అమ్ముకోకు... 
• అభ్యర్థి నచ్చకుంటే నోటాకు ఓటు వేయు
• డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కొని గెలుపొందిన ఎమ్మెల్సీ అభ్యర్థులు 
విద్యా సమస్యలపై ఎలా గళం విప్పుతారు..!


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ బ్యూరో : నోటుకి ఓటు నీ భవితకు చేటు. దేశ ప్రగతికి గొడ్డలి పెట్టు. ఉజ్వల భవిష్యత్తుకు తాకట్టు... తాల ఎత్తుకోలేని గొర్రె ఖరీదు పది వేలపై మాటే.. గాడిద ఖరీదు లక్ష పై మాటే... ఆలోచించగలిగే ఓ పట్ట భద్రుడ అంగట్లో దొరికే ఆగది సరికేనా నీ ఓటు.. వేయికో... రెండు వేలకో అమ్మ డానికి.. ప్రస్తుతం జరుగుతున్న టీచర్, గ్రాడ్యుయేట్ కోటాలో భర్తీ అవ్వాల్సిన ఎమ్మెల్సీ సీటు మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో పోటీ చేస్తున్న అభ్యర్థుల గురించి మీకు పూర్తి అవగాహన వచ్చే ఉంటుంది. ఎవరు మంచి వారో.. ఎవరు అందుబాటులో ఉంటారో .. ఎవరు సేవ చెయ్యగలరో ఆలోచించి, మీ సమూహంతో చర్చించి ఓటు వేయండి. ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థులైన సరే..! స్వతంత్ర అభ్యర్థులకు నేను ఓటు వేస్తే గెలుస్తాడా..? అనే ఆలోచన నుండి బయటకు రండి.

పట్ట భద్రులు రేపటి భవిష్యత్తుకు బలం..


ప్రపంచంలో ఎక్కడ లేని పట్ట భద్రుల యువత మన దేశానికి సొంతం. ఈ పట్ట భద్రుల యువత రేపటి భారత దేశం భవిష్యత్తుకు బలం. నేడు కొందరు పట్ట భద్రులు తమ బాధ్యతను పక్కన పెట్టడం బాధాకరం. రేపు జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వలాభం కోసం పట్ట భద్రులను నోటుకు ఓటు వల వేసి అమ్ముకునేలా అలవాట్లు చేస్తున్నారు. పట్ట భద్రులైన యువత ప్రలోభాలకు లొంగు. ఇది ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్సీ పదవి అంటే ఐదేళ్ల పాటు ఒక సింహాసనం అనుకుంటు న్నారు అభ్యర్థులు. విద్యా సంస్థలు నెలకొల్పి విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూళ్లు చేస్తూ పీల్చి పిప్పి చేసిన వారు కొందరు.. రియల్ ఎస్టేట్, వ్యాపారం, పాఠ్య పుస్తకాల దందా చేస్తూ, ఇంకొందరు అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. ఇటువంటి వారేనా గెలిచిన తరువాత పట్ట భద్రులకు న్యాయం చేస్తారని ఏమీటీ నమ్మకం...

మార్పు మీతోనే సాధ్యం...


ఒక వేళ పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో నిజాయితీ పరులు ఎవ్వరూ లేకపోతే నోటాకు అయిన ఓటు వేయండి. కానీ నీ అమూల్యమైన ఓటును మాత్రం అమ్ముకోకూ. విలువైన ఓటును విజ్ఞతతో వినియోగించుకో.. ఒకటికి రెండుసార్లు ఆలోచించుకో.. ఓటును మాత్రం సద్వి నియోగం పర్చుకోండి. పట్ట భద్రులారా మార్పు మీతోనే సాధ్యం.
Comments
 -Advertisement-