-Advertisement-

Police : వాహ్... ఖాకీ ఔదార్యం...!!

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,బోధన్: ఎందరో ఖాకీలు అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి చిక్కడం, పోలీస్ స్టేషనులకు న్యాయం కోసం వచ్చే బాధితులతో ప్రేమ ప్రయాణం నడుపుతూ ఆత్మహత్య చేసుకోవడం, బడా బాబులకు కొమ్ముకాస్తూ సామాన్య ప్రజలకు న్యాయం చేయడంలో వెనుకంజ వేస్తున్నారని, పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించారు అంటూ ఎన్నో వార్తలు చదువుతుంటాం... కానీ ఈ ఖాకీ మాత్రం తన భుజాలపై మృతదేహాలను మోసి ఎందరికో ఆదర్శ ఆదర్శప్రాయుడై.. ఎందరో అభినందనలు పొందుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే... విద్యుత్ ఘాతంతో మృతి చెందిన ముగ్గురి మృతదేహాలను బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, పోలీస్ సిబ్బంది పొలం నుంచి రోడ్డుకు మోసుకొచ్చారు.
రెంజల్ మండలం చాటాపూర్ గ్రామానికి చెందిన గంగారం, బాలమణి, వారి కుమారుడు కిషన్ ముగ్గురు వ్యక్తులు గురువారం విద్యుత్ ఘాతంతో పొలంలో మృతి చెందారు. ఇట్టి విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు తన సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను రోడ్డుకు మోసుకొచ్చారు. ఈ ఖాకీ ఔదార్యం చూసి ప్రజలు ఖాకీ అంటే ఇలా ఉండాలి అని ప్రశంసిస్తున్నారు.
Comments
 -Advertisement-