-Advertisement-

Sevalal Mahraj birthday anniversary: సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

Sevalal Photo Sevalal Maharaj Sevalal Maharaj Jayanti Sevalal Maharaj wife name Sant Sevalal Maharaj died Sevalal Jayanti date Sevalal Maharaj history
Vaasthava Nestham
• జిల్లా పాలనాధికారి రాజర్షి షా

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: సంత్ సేవాలాల్ మహారాజ్ 286 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా పాలనాధికారి రాజర్షి షా తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 24 వ తేదిన పట్టణంలోని రామ్ లీలా మైదాన్ లో నిర్వహించనున్న జయంతి వేడుకలకు ఏంఎల్సి ఎన్నికల కోడ్ ఉన్నందున ఎన్నికల కోడ్ నియమ నిబంధనల ననుసరించి ఉత్సవాలను జరపాలని ఆన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉత్సవ కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఐటిడిఎ పిఓ ఖుష్బూ గుప్తా తో కలిసి సమావేశం నిర్వహించారు. 
Sevalal Photo
Sevalal Maharaj
Sevalal Maharaj Jayanti
Sevalal Maharaj wife name
Sant Sevalal Maharaj died
Sevalal Jayanti date
Sevalal Maharaj history
Sevalal temple

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంబంధిత అధికారులు ఆర్టీసీ ద్వారా బస్ సౌకర్యం కల్పించాలని, విద్యుత్ శాఖ ద్వారా నిరంతర కరెంట్ సరఫరా చేయాలని, మున్సిపల్, రెండు రోజుల ముందు నుండే శానిటేషన్ చేయాలనీ పంచాయితి శాఖ ద్వారా ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని, మిషిన్ భగీరథ త్రాగునీరు సౌకర్యం, వైద్య శాఖ ద్వారా మెడికల్ క్యాంప్ ఏర్పాటు, పోలీస్ శాఖ ద్వారా బారికేడింగ్స్, పోలీస్ బందోబస్తు, పార్కింగ్ ప్లేస్ తదితర ఏర్పాట్లు చేయాలని, 24 వ తేదీన నిర్వహించనున్న సంత్ సేవలాల్ జయంతి ఉత్సవాలకు ఆన్ని ఏర్పాట్లు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆన్నారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, ఆర్డీవో వినోద్ కుమార్, బంజారా ఉత్సవ కమిటీ చైర్మన్ భీమ్ రావ్, ఉత్సవ కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
 -Advertisement-