Sri Sai Vrudhashramam : వృద్ధులకు నిలయం... సాయిలింగి ఆలయం
By
Vaasthava Nestham
మానవ జీవిత దశలలో వృద్ధాప్యం చాలా సంక్లిష్టతలను, సమస్యలతో కూడుకున్నది. నేటి యువత ఉపాధి వేటలో నగరాలకు వలస పోతున్నారు. మెరుగైన జీవితం కోసం పల్లెటూరి విడిచి పట్టణానికి వెళ్తుంది. ఫలితంగా వృద్ధులైన తల్లితండ్రులకు చుసే వాళ్ళు లెక ఒంటరిగా మిగిలి మానసిక ఒత్తిడి, సమస్యలు తలెత్తుతున్నాయి.ముసలి శరీరం తనంతట తానుగా సహాయం చేయకపోవడంతో వృద్ధులు ఆశ్రమాలను ఆశ్రయిస్తున్నారు. Sri Sai Vrudhashramam
అటువంటి వృద్ధులకు, అనాథలుకు మానసిక వికలాంగులకు నేను ఉన్న అని భరోసా ఇచ్చి సామాజిక స్పృహతో వృద్ధుల మానసిక, శారీరక, భావోద్వేగ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు మరియు వృద్ధుల సంరక్షణ, భద్రత , సౌకర్య సేవలు SAI Old Age Home in Adilabad అందించాలనే లక్ష్యంతో శ్రీ దెబ్బడి అశోక్ గారు భారత్ సంచార్ నీగం లిమిటెడ్ లో ఉన్న సహాయ మ్యానేజర్ ఉద్యోగ జీవితాన్ని త్యాగం చేసి సామాజిక అభివృద్ది లక్ష్యంతో సాయిలింగి గ్రామంలో శ్రీసాయి వృద్ధాశ్రమాన్ని 2007 లో స్థాపించారు. Sri Sai Vrudhashramam
ఆశ్రమ నిర్మాణం..
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని సాయిలింగి గ్రామంలో 2007 లో ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఆదిలాబాద్ నుండి మహారాష్ట్రలోని మాండ్వికి వెళ్ళె రహదారి ప్రక్కన ప్రకృతి ఒడిలో సహ్యాద్రి కొండలను అనుకొని సువిశాలమైన ప్రదేశంలో శ్రీ షిర్డీసాయి సేవా సొసైటి వ్యవస్థాపకులు దెబ్బడి అశోక్ వృధ్ధాశ్రమాన్ని ప్రారంభించారు. సాయిలింగి గ్రామానికి చెందిన రైతు గౌతు నాగోరావు రెండున్నర ఎకరాల విస్తీర్ణం గల భూమి ఆశ్రమ కోసం విరాళం ఇచ్చారు.ఆశ్రమంలో గోశాల, కిచెన్ గార్డెన్, కార్యాలయం గది, పడకగది, వంటగది, భోజనాల గది, స్నానపు గదులు, మరుగుదొడ్లు, విశాలమైన వరండ, ఆశ్రమ భవనం పైన సూర్య శక్తి వినియోగం కోసం సోలార్ ప్లాంట్ మొదలగు ఉన్నాయి.ఆశ్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర లోని యవత్మాల్, నాందేడ్ జిల్లాల నుండి వృద్ధులు, మానసిక వికలాంగులు, అనాధలు మొత్తం 45 మంది ఉంటున్నారు. సాయిలింగి గ్రామంలో తొలి సారిగా వృద్ధాశ్రమం కోసం తొమ్మిది లక్షల నిధులతో భవనం ప్రారంభించారు. అందులో వృద్ధులకు ప్రత్యేకించి ఐదు గదులు కేటాయించారు. ఒక గదిలో 8 చోప్పున మొత్తం నలభై ఐదు వృద్ధులు, మానసిక వికలాంగులు, అనాధలు ఉంటున్నారు. దాతల సహాయంతో వాళ్ళుకు
పడుకోవడానికి మంచాలు,పరుపు, కప్పుకోవడానికి దుప్పట్లు,చూడడానికి టెలివిజన్, ధరించడానికి బట్టలు, సుబ్బులు, నునె,చికిత్స కోసం ముందులు, సాధక బాధలు చూడడానికి ఆరుగురు ఉద్యోగస్థులను శ్రీషిర్డీ సాయి సేవా సొసైటి ఆధ్వర్యంలో నియమించి జీతాలు కూడా చెల్లిస్తున్నారు. ఆశ్రమంలో నీటి సౌకర్యం కల్పించి Sri Sai Vrudhashramam
తాగడానికి రెండు మంచినీళ్ళ ఫిల్టర్లు ఏర్పాటు చేశారు. భోజనానికి ప్రత్యేక భోజనశాల అందులో డైనింగ్ టేబుల్, ప్లేట్లు, గ్లాసులు, రుచికరమైన భోజనాలు అందిస్తున్నారు. కాలకృత్యాలకు స్నానపానాదులు, మరుగుదొడ్లును నిర్మించడంతో పాటు వాటిని కూడా నిర్వహించడం ద్వారా అత్యున్నత ప్రమాణాల పరిశుభ్రతను పాటిస్తూన్నారు.
SAI Old Age Home in Adilabad
నిర్వహణ బాధ్యత...
శ్రీషిర్డీ సాయి సేవా సొసైటి వ్యవస్థాపకులు దెబ్బడి అశోక్, వృధ్ధాశ్రమాన్ని పూర్తి నిర్వహణ,నిర్మాణ బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకొని తన సొంత ఖర్చులతో సాయిలింగి గ్రామస్తులు,దాతల సహాయ సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. తమ ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు ఎటువంటి ఇబ్బందులూ వచ్చినా సాయిలింగి గ్రామస్థులతో ఆశ్రమంలో ఉన్న సమస్యను పరిష్కరించి అందరి సహాయ సహకారంతో
నిర్వాహకులు నూటికి నూరు శాతం నిజాయితీతో చిత్తశుద్ధితో నిస్వార్థంగా కృషి చేస్తూ వృద్ధులకు ఉచిత సేవలు అందిస్తున్నారు. ఆశ్రమంలో ప్రతి పండుగలు, పర్వదినాలు, ప్రముఖుల జయంతి, జాతీయ దినోత్సవాలు ఇతరేతర కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు
ఆశ్రమంలో కిచెన్ గార్డెన్...
ఆశ్రమంలో వృద్ధులకు రోజు వారి ఆహారంలో భాగంగా తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల కొసం ఈ కిచెన్ గార్డెన్ ను ఒకటి న్నర ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఇందులో ఆశ్రమంలో ఉండే పశువుల సేంద్రీయ ఎరువులతో ఆకు కూరలు, కూర గాయాలు, వివిధ రకాల పండ్లు,మామిడి, బొప్పాయి లాంటి మొక్కలను పెంచుతున్నారు. తోటలోకి ఎన్నో రకాల పండ్లు, పూల మొక్కలు. కిచెన్ గార్డెన్ లో నీటి పారకం, తోట లో ఒక మొక్క నుండి మరో మొక్కకు నీళ్ళ పారకానికి కాలువ రూట్ కెనాల్ లా ఏర్పాటు చేశారు.నీరు వాడిన తరువాత మిగిలిన వృథా నీరు కోసం నీటి నిల్వకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారు.తోటలో షిర్డీ సాయిబాబా ఆలయం నిర్మించారు. ఈ అందమైన రమణీయమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో కొంత సేపు విశ్రాంతి తీసుకోడానికి ఆలయ సమీపంలో సిమెంటు బెంచీలు ఏర్పాటు చేశారు. తోట మధ్యలో పక్షులకు కోసం నీటి తొట్టెలు ఏర్పాటు చేశారు. తోటలో నేల పై ఎక్కడ గడ్డి చెత్త చెదారం లేకుండా చాల శుభ్రతను పాటిస్తూన్నారు. SAI Old Age Home in Adilabad
గోశాల నిర్వహణ ... SAI Old Age Home in Adilabad
సాయి లింగి గోశాలలో ప్రస్తుతం మొత్తం పది ఆవులు ఉన్నాయి. ఆశ్రమ నిర్వాహకులు, సేవా సొసైటి సభ్యులు, సహాయం సహాకారంతో ఆవులను సంరక్షణ చేయడం,పశువుల నివాసం కోసం విశాలమైన స్థలంలో ఆవాసం, పశుగ్రాసం, నీటి తొట్టి ఏర్పాటు చేశారు.పశువులకు పోషక మైన ఆహారాలు అందించడం వైద్యులుచే పరీక్షించి తదనుగుణంగా చికిత్స అందించడం జరుగుతుంది.
వ్యాసకర్త: రాథోడ్ శ్రావణ్
పూర్వ అధ్యక్షులు, ఉట్నూర్ సాహితీ వేదిక ఉట్నూర్, ఆదిలాబాద్ జిల్లా, 9491467715
Comments