-Advertisement-

Betting Apps: బెట్టింగ్ యాప్స్ ప్రచారం..11 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు

Betting apps in India Top 10 betting apps Top 10 betting apps in India Top betting apps in India Betting apps with free money Legal betting apps in In
Vaasthava Nestham
Betting Apps: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది సెలబ్రెటీలపై తెలంగాణ రాష్ట్ర పోలీసులు తాజాగా కేసులు నమోదు చేశారు. సజ్జనార్ యాప్స్ వ్యతిరేకంగా ఉద్యమాన్ని మొదలుపెట్టారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రెటీ పై కఠిన చర్యలు చేపట్టింది. ముఖ్యంగా తెలంగాణ పోలీసులు యూట్యూబ్లో మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు టార్గెట్గా పెట్టుకొని నిఘా ఉంచి ఆ ఆప్లను ప్రోత్సహిస్తున్న వారిపై కేసులను కూడా నమోదు చేసింది. తాజాగా ఐపీఎస్ అధికారి ప్రస్తుత ఆర్టీసీ ఎం డి సజ్జనర్ ఈ విషయంపై తీవ్ర హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. ఇప్పటి యువతను ఆన్లైన్ బెట్టింగ్ వేగంగా ఆకర్షిస్తుందని ఆయన అన్నారు.

ఆన్లైన్ బెట్టింగ్ ప్రాథమికంగా చిన్న మొత్తంలో డబ్బులు పెట్టి ఆడేలా ఉన్నా కూడా ఆ తర్వాత క్రమంగా అది వారిని తీవ్రమైన ఆర్థిక సమస్యల్లోకి నెట్టేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లలో లాభాలు వస్తాయని భావించిన వాళ్లందరూ చివరకు అప్పుల పాలై కుటుంబాన్ని కుదేలు చేసుకుంటున్నారు. అలాగే చాలామంది బట్టబయలైన చెక్కుల కేసుల్లో చిక్కుకొని ఆత్మహత్యలు కూడా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితిని అదనంగా తీసుకొని చాలామంది యూట్యూబర్లు మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తమ ఫాలోవర్లను ఆకర్షించేందుకు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ డబ్బులను సంపాదిస్తున్నారు.

ఈ యాప్ లకు సెలబ్రిటీల పరిధి సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉండడంతో యువత కూడా వీరి మాటలు నమ్మి బెట్టింగ్ యాప్ ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తున్న 11 మంది సెలబ్రిటీలపై తెలంగాణ పోలీసులు కఠిన చర్యలు నమోదు చేశారు. వాళ్లలో విష్ణుప్రియ, సుప్రీత, రీతు చౌదరి, హర్ష సాయి, పరేషాన్ బాయ్స్, టేస్టీ తేజ, ఇమ్రాన్, అజయ్, కిరణ్ గౌడ్, భయ్యా సన్నీ యాదవ్, సుధీర్ రాజు వంటి వాళ్ళు ఉన్నట్టు సమాచారం. అయితే వీళ్ళందరూ సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ యాప్స్ కు ప్రమోట్ చేయడం వలన అనేక మంది యువత తప్పుదోవ పడుతున్నారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.