కాంగ్రెస్, బీజేపీ లో టెన్షన్ పెరిగిపోతోందా...?
Mlc elections in telangana 2025
MLC Elections in Telangana apply Online
Mlc elections in telangana 2025 karimnagar
Mlc elections in telangana
By
Vaasthava Nestham
• 25 శాతం ఓటింగ్ పెరగడంతో అభ్యర్థుల్లో కలవరం
• ప్రసన్న హరికృష్ణకు బీసీ నినాదం కలిసివచ్చేనా..?
• బీసీ నినాదం ప్రసన్న కు ప్లస్ అవ్వనుందా..?
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ బ్యూరో : ఇటీవల రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో చర్చంతా ఒక్క సీటుగురించే జరుగుతోంది. ఆ సీటు ఏమిటంటే మెదక్- కరీంనగర్- నిజామాబాద్- ఆదిలా బాద్ జిల్లాల పరిధిలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక. ఈనెల 27వ తేదీన ఒక గ్రాడ్యుయేట్+2 టీచర్ ఎంఎల్సీ సీట్లకు ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. మూడు సీట్లకు ఎన్నికలు జరిగినా గ్రాడ్యుయేట్ నియోజకవర్గం మీద మాత్రమే ఎందుకు చర్చ జరుగుతోంది..? ఎందుకంటే ఇందుకు కొన్ని కీలకమైన కారణాలున్నాయి. మొదటిది పోటీ చేయని బీఆర్ఎస్ ఓట్లు పోటీ చేసిన పార్టీల్లో ఎవరికి పడ్డా యనే విషయంలో క్లారిటిలేక అయోమయం పెరిగి పోతోంది. రెండో కారణం గ్రాడ్యుయేట్ నియోజక వర్గంలో కాంగ్రెస్, బీజేపీ ల మధ్యే పోటీ అని చాలామంది అంచనా వేసినా అందరి అంచనాలను తల్లకిందులుచేస్తు బీఎస్పీ అభ్యర్ధి ప్రసన్న హరికృష్ణ ఒక్కసారిగా దూసుకురావటం. మూడోపాయింట్ రెండు టీచర్ ఎమ్మెల్సీ సీట్లలో కాంగ్రెస్ పోటీకి దూరంగా ఉండటం.
నాలుగోపాయింట్ ఏమిటంటే 'బీసీ' నినాదం బాగా హైలైట్ అవ్వటం. పై కారణాలతోనే గ్రాడ్యుయేట్ నియోజకవర్గం ఎమ్మెల్సీ గెలుపోటములపై తెలంగాణ వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. తాజా ఎన్నికల్లో ఓటింగ్ సగటు సుమారు 85 శాతంగా నమోదవ్వటం కూడా మరో కారణం. పోయిన ఎన్నికల్లో పై మూడుసీట్ల ఎన్నికలో సగటు ఓటింగ్ సుమారు 60 శాతం మాత్రమే. అంటే పోయిన ఎన్నికతో పోల్చుకుంటే తాజా ఎన్నికలో 25 శాతం ఓటింగ్ ఎక్కువగా జరిగింది. 25 శాతం ఓటింగ్ అదనంగా జరగటం మామూలు విషయం కాదు. అందుకనే పెరిగిన 25 శాతం ఓటింగ్ ఎవరిని గెలిపిస్తుందో ? ఎవరిని ఓడిస్తుందోనంటూ టెన్షన్ నెలకొంది.
గ్రాడ్యుయేట్ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలో గమనించాల్సిన విషయం ఏమిటంటే గ్రౌండ్ రిపోర్టు, పోల్ సర్వేల ప్రకారం పోటీ ప్రధానంగా బీజేపీ-బీఎస్పీ అభ్యర్ధుల మధ్యే ఉంటుందని, మామూలుగా అయితే పోటీ కాంగ్రెస్ అభ్యర్ధి వూటుకూరి నరేంద్రరెడ్డి, బీజేపీ అభ్యర్ధి చిన్నమైల్ అంజిరెడ్డి మధ్యే ఉంటుందని అందరు అనుకున్నారు. ఇద్దరిలో కూడా అంజిరెడ్డికి కాస్త మైలేజ్ ఉంటుందని అంచనాలు వేసుకున్నారు. అయితే అనూహ్యంగా బీఎస్పీ అభ్యర్ధి ప్రసన్న హరికృష్ణ దూసుకొచ్చారు. అంజిరెడ్డి, నరేందర్ రెడ్డి పార్టీల ఓట్లపైన ఎక్కువగా ఆధారపడ్డారు. ఇదే సమయంలో ప్రసన్న బీసీ నినాదాన్ని ఆయుధంగా చేసుకుని రేసులోకి దూకారు. బీసీ సామాజిక వర్గాల తో ప్రసన్న చాలా సమావేశాలు నిర్వహించారు. బీసీ సంఘాల్లోని కీలకనేతలను ప్రసన్నం చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. అందుకనే పార్టీ రహితంగా బీసీలందరు ప్రసన్నకు ఓట్లేసి గెలిపించాలని బీసీల సంఘాల నేతలు బహిరంగంగా పిలుపు ఇవ్వటం, ప్రచారం చేయటం బాగా ప్రభావం కనిపించిందని విశ్లేషకులు అంటున్నారు.
ప్రసన్న బీసీ అస్త్రం ఏ స్ధాయిలో పనిచేసిందంటే..
కాంగ్రెస్ అభ్యర్ధి పోటీలో ఉన్నా తమ అభ్యర్ధిని కాదని పార్టీ ఎంఎల్సీ తీన్మార్ మల్లన్న లాంటి అనేక మంది కాంగ్రెస్ నేతలు ప్రసన్నకు బహిరంగంగానే మద్దతు పలికి ప్రచారం చేశారు. అలాగే బీజేపీలో కూడా కొందరు బీసీ నేతలు ప్రసన్నకు లోపాయికారీగా సహకరించారనే ప్రచారం జరుగుతోంది. సో, క్షేత్ర స్ధాయిలో జరుగుతున్న ప్రచారం నిజం అయితే పోటీ అంజిరెడ్డి-ప్రసన్న మధ్యే ఉంటుంది. చివరకు ప్రసన్న గెలిచినా ఆశ్చర్యపోవక్కర్లేదనే ప్రచారం కూడా జరు గుతోంది. కాంగ్రెస్ అభ్యర్ధి నరేందర్ రెడ్డి మూడో స్ధానానికే పరిమితమవుతారని ఆ పార్టీలోనే టాక్ నడుస్తోంది.
బీఆర్ఎస్ తో సాన్నిహిత్యం...
బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కవిత, కేటీఆర్ తదిత రులతో తనకున్న సాన్నిహిత్యాన్ని ప్రసన్న బాగా ఉప యోగించుకున్నట్లు సమాచారం. ఎలాగూ బీఆర్ఎస్ పోటీ చేయటం లేదు కాబట్టి ఆ పార్టీ ఓట్లు తనకే పడేట్లుగా ప్రసన్న మ్యానేజ్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మెజారిటి ఓటర్లు ఏ అంశం మీద ఓట్లేశారంటే కేవలం బీసీ సామాజికవర్గం అభ్యర్ధి అన్న పాయింట్ మీదే ఓట్లేశారని సమాచారం. ఇపుడు తెలంగాణ లో బీసీ నినాదం బాగా కాయిన్ అవుతు న్న విషయం తెలిసిందే. మెదక్-కరీంనగర్-నిజామా బాద్-ఆదిలాబాద్ జిల్లాల్లో నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బీసీ సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
బీసీ నినాదంతో...
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్ధానిక సంస్ధల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన దగ్గర నుండి బీసీ నినాదం బాగా ఊపందుకుంటోంది. రేవంత్ ను ఇరుకున పెట్టడానికి బీఆర్ఎస్, బీజేపీలోని కీలక నేతలు కూడా పదేపదే బీసీ జపం చేస్తున్నారు. దీంతో ఇపుడు తెలంగాణలో బీసీలకు రాజ్యాదికారం, బీసీ నేతకే ముఖ్యమంత్రి పదవి లాంటి అంశాలు ఎక్కువగా ఫోకస్ అవుతు న్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈమధ్యనే బయట పెట్టిన కుటుంబసర్వే తో బీసీ సామాజికవర్గంపై చర్చ బాగా పెరిగిపోయింది. ఈ నేపధ్యంలో జరిగిన ఎంఎల్సీ ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారైతే, బీసీ సామాజిక వర్గం అవటం ప్రసన్నకు బాగా కలిసొచ్చిందనే ప్రచారం జరుగుతోంది. అందుకనే ప్రసన్న గెలిస్తే ఎక్కువ క్రెడిట్ బీసీ నినాదానికే దక్కుతుందనటంలో సందేహం లేదు. మరి మార్చి 3వ జరిగే కౌంటింగులో ఎలాంటి ఫలితం వస్తుందో వేచి చూడాలి..!!
Comments