-Advertisement-

ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా హోలీ పండుగను జరుపుకోవాలి

Vaasthava Nestham

• జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ పోస్టులు
• ఇతరుల అనుమతి లేకుండా రంగులను పుయ్యరాదు
• తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై జాగ్రత్తలు వహించాలి
 జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : హోలీ పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా యువత విద్యార్థులు ప్రజలకు సంబంధించి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పలు సూచనలు తెలియజేశారు. ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా పండుగను నిర్వహించుకోవాలని తెలిపారు. యువత, విద్యార్థులు మద్యం సేవించి వాహనాలను నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలని తెలిపారు. నదులు, వాగులు, చెరువులలో ఈత రాని వారు వెళ్లకుండా ఉండడం శ్రేయస్కరమని తెలియజేశారు. వాహనాలు నడిపే వారిపై రంగులు చల్లుతూ ఇబ్బందులు కలిగించకూడదని తెలిపారు. ఇతరుల అనుమతి లేకుండా రంగులను పూయరాదని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్పోస్ట్లను ఏర్పాటు చేసి మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని నియంత్రించడం జరుగుతుందని తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు. యువత రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటివి చేయకుండా తల్లిదండ్రులు గమనించాలని సూచించారు.
Comments
 -Advertisement-