-Advertisement-

కష్టపడి చదివాడు.. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు

Vaasthava Nestham

• హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికైన పంచాయతీ సెక్రెటరీ 


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: సాధనపు పనులు సమకూరు 
ధరలో అని అన్నాడు కవి వేమన్న.. దీనినే ఇన్స్పిరేషన్ గా తీసుకున్న ఓ యువకుడు రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి.. కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించాడు.. నిర్మల్ జిల్లా మామడ మండలం తాండ్ర గ్రామానికి చెందిన కోడిపుల్ల ప్రభాకర్.. ప్రభాకర్ చిన్నప్పటినుండి చదువులో చురుకుగా ఉండేవాడు. గత నాలుగు ఏళ్ల క్రితం జూనియర్ పంచాయతీ సెక్రెటరీగా ఎంపికై నేరడిగొండ మండలంలో విధులు నిర్వహిస్తూ 
ఉన్నత ఉద్యోగమే తన లక్ష్యంగా ఒకపక్క పంచాయతీ సెక్రెటరీగా విధులు నిర్వహిస్తూ మరో ప్రక్క ఉన్నత ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఇటీవల వెలువడిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికై ఆదర్శంగా నిలిచాడు. 
ప్రభాకర్ పదో తరగతి వరకు ఇచ్చోడ మండల కేంద్రంలోని హైస్కూల్లో విద్యనుభ్యసించాడు. ఇంటర్మీడియట్ , డిగ్రీ నిర్మల్ లో పూర్తిచేసి తెలంగాణ విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేశాడు. ఇటీవల విడుదలైన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగ ఫలితాల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా ప్రభాకర్ ఉద్యోగం సాధించాడు. ఈ సందర్భంగా ప్రభాకర్ ను పలువురు ప్రజా పతినిధులు అభినందించారు. గ్రూప్-1 ఉద్యోగమే తమ లక్ష్యమని ప్రభాకర్ 'వాస్తవ నేస్తం' తో తెలిపాడు.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.