-Advertisement-

ఖురాన్ పఠనం... సద్గతికి మార్గం..!

Ramadan Kareem text , Ramadan Kareem in Arabic , Ramzan mubarak 2025 , Ramadan kareem 2025 wishes , Ramadan Kareem images , Ramadan kareem drawing
Vaasthava Nestham

• ధర్మంతోనే శాంతి, సౌఖ్యం ..
• ఖురాన్ గ్రంథం ప్రతి ముస్లిం సోదరుడికి మార్గ దర్శకం
• నేటి నుండి పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షలు ప్రారంభం 


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ బ్యూరో : ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్ నేటి నుండి ప్రారంభమైంది. రంజాన్ మాసంలో ముస్లింలు అత్యంత కఠోరంగా, నిష్ఠతో ఉపవాసాలు ఉంటారు. నెలరోజులపాటు ముస్లింలు రోజా ఉంటారు. రోజా అంటే ఉపవాసం అని అర్థం.. దాదాపు 14 నుండి 15 గంటల పాటు ఉపవాస దీక్ష ఉంటుంది. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలందరూ నమాజులో అల్లాహ్ ను స్మరించుకుంటూ, ఖురాన్ పఠనానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు.. ఆ గ్రంథం సుగుణాలమయం. ఖురాన్ లో అడుగడుగునా శాంతి సమానత్వం సహనం ప్రస్తావన ఉంది. దైవం భూమిపై మానవులని పుట్టించినప్పటి నుంచి మహమ్మద్ ప్రవక్త వరకు 1,24000 ప్రవక్తలను, నాలుగు దైవ గ్రంధాలను అవతరింపజేసినట్లు ధార్మిక పండితులు చెబుతున్నారు. 
ప్రవక్తలో చిట్ట చివరి ప్రవక్త మహ్మద్. ఈయన ప్రవక్తగా ఉన్న 23 ఏళ్లలో ఖురాన్ ను దేవుడు పలు సందేశాల ద్వారా అందించారు. ఈ గ్రంథం అరబ్బీ భాషలో ఉంది ఇందులో 30 కాండాలు, 114 సూరాలు, 6666 వాక్యాలు ఉన్నాయి. ఏదైనా సమస్య వచ్చిన ప్పుడు మహ్మద్ ప్రవక్త దైవం వైపు చూసేవారు. దైవం తన సందేశాన్ని దూత జిబ్రాయిల్ ద్వారా పంపేవారు. దాన్ని అందుకున్న ప్రవక్త తన అనుచరులకు చెప్పేవారు, వారు రాసి భద్రపర్చేవారు. ఇలా 23 ఏళ్ల పాటు దైవం నుంచి సందేశాలు రావడం, వాటిని ప్రవక్త ద్వారా అనుచరులు భద్రపర్చేవారు. మొత్తం సందేశాలను క్రోడీకరించగా ఏర్పడిన గ్రంథమే ఖురాన్. ప్రవక్త కాలంలో గ్రంథం ఎలా ఉందో నేటికి ఒక్క అక్షరం పొల్లు మారకుండా ఉండటం విశిష్టత. ఏకత్వం ప్రస్తావన ఎక్కువ ఖురాన్ గ్రంథంలో దేవుడికి ఏకత్వంపై ఎక్కువగా ప్రస్తావన ఉంది. గ్రంథంలో ఓ మారు అల్లాహ్ ఇలా సెలవిచ్చారు. ఓ ప్రవక్త వారికి సెలవివ్వండి దేవుడు ఒక్కడే. ఆయన ఎవరిని పుట్టించలేదు. ఆయన కూడా ఎవరికి పుట్టిన వాడు కాడు. ఆయనకు సరి సమానుడు లేడు. చూసేందుకు ఇవి చాలా చిన్న వాక్యాల మాదిరిగానే కనిపించవచ్చు. ఈ అనం తమైన సృష్టిని సృష్టించిన వాడు ఒక్కడే. ఆయనే నిజమైన దేవుడు. అన్ని ఆరాధనలు ఆయనకే సొంతం. సృష్టిలో ఉన్న ప్రతిదీ ఆయన పై ఆధారపడి ఉంది. ఆయన ఎవరిపై ఆధార పడి లేడు. ఆయనకు పుట్టుపూర్వోత్తరాలు వంశపారంపర్యాలు లేవు. ఆయన మహా శక్తి మంతుడు. గుణగణాల్లో, శక్తి సామర్త్యాల్లో ఎవరూ సురికాలేరు. ఆయన అభీష్టం మేరకే సృష్టి నడుస్తోంది. ఆయన ఒక ఆజ్ఞతో సృష్టిని సృష్టించగలడు. సృష్టిని నామరూపాలు లేకుండా చేయగలడు.

సుగుణాలమయం...


ఖరాన్ గ్రంథంలో సూరాయే సహల్ 16 వ కాండంలో ఇలా ప్రస్తావించబడింది. నిస్సందే హంగా అల్లాహ్ ఆదేశిస్తున్నాడు. న్యాయం, ఉపకారం, బంధువుల హక్కుల గురించి, అదే విధంగా సిగ్గు మాలిన కార్యక్రమాలను నిషేధి స్తున్నాడు.  
• ఆధ్ల్ అంటే న్యాయం, సమానత్వం, సమ భావం అనే అర్థం వస్తుంది. ఒకరితో ఉన్న శత్రుత్వం, కక్షల వల్ల న్యాయం చేయాల్సిన చోట అన్యాయం చేయకూడదు.
• ఎంత కష్టం, ఒత్తిడి వచ్చిన న్యాయం వైపే ఉండాలి.
• ఎదుటివారి హక్కులను గౌరవించాలి.
• శత్రువు వచ్చినా అతడికి న్యాయం చేయాలి.
• పంపకాల విషయంలో సమానత్వం ఉండాలి.
• పేదవాడికి తక్కువ చేయడం, ధనవంతుడికి పెద్ద పీట వేయడం ఇస్లాo ధర్మానికి విరుద్ధం.
• ఎహ్ సాన్ అనగా ఉత్తమంగా వ్యవహరించడం, న్యాయంగా ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువగా ఇవ్వడం. ఇలాంటి చర్యల వల్ల సమాజంలో శాంతి, సుస్థిరత ఏర్పడుతాయి. ఉపకారం ద్వారా ఆత్మీయత, ఆప్యాయత పెరుగుతాయి.
• ప్రస్తుత సమాజంలో అశాంతి, గొడవలకు కారణం బంధువుల మధ్య సఖ్యత లేకపోవడం అని చెప్పవచ్చు.
• ఖురాన్ లో బంధువుల హక్కులను ప్రతి ఒక్కరు గౌరవించాలని పేర్కొనబడింది.
• బంధాల్లో మనపై తల్లిదండ్రులు, సోదరులు, సోదరీమణులు, భార్య, సంతానం హక్కులు ఉంటాయి. వారి హక్కులను పూర్తి చేయడంలో ఏ చిన్న లోపం చేసిన దైవా గ్రహం తప్పదు.
• ఈ రోజుల్లో అడుగు స్థలం కోసం రక్తం పంచుకుని పుట్టిన సోదరుల మధ్య గొడవలు, రక్తపాతాలు, నిత్యం ఏదో ఒక ప్రాంతంలో జరగడం చూస్తూనే ఉన్నాం. సంసారంలో భార్య భర్తల మధ్య గొడవల కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ బంధువుల హక్కులను గౌరవించకపోవడంతో నేజరుగుతున్నాయి. తమ హక్కులను ఎంత వరకు నెరవేరుస్తు న్నామో గుర్తుంచుకోవాలి. పవిత్ర ఖురాన్ లో న్యాయం, ఉపకారం, బంధువుల హక్కులపై సవివరంగా ఉంది. ఇందులో పేర్కొన్న విధంగా మనం నెరవేర్చాల్సిన హక్కులను తెలుసుకుని జీవనం సాగిస్తే ప్రపంచమంతా శాంతి వెక్కివిరుస్తుంది.

నిషేదించినవి...


ఖురాన్ గ్రంథం పలు విషయాలను నిషేధించింది. ముఖ్యంగా ఫహష్ అంటే సిగ్గు మాలిన పనులు. మనకు తెలియకుండా మనం మన సంస్కృతి వైపు ఆకర్షితులవుతున్నాం. నాగరి కత అనే పేరుతో విచ్చల విడిగా వ్యవహరిస్తు న్నాం. నీతి బాహ్యమైన పనులు చేసే వాడికి నరకాగ్ని శిక్షగా విధించబడుతుందని ఖురాన్ గ్రంథం పేర్కొంటోంది. ఎదుటి వారికి చెందిన రూపాయిని మనం అన్యాయంగా తీసుకున్నా పెద్ద నేరమే. ఖురాన్ ను రంజాన్ మాసంలోనే కాకుండా ఎప్పుడైనా చదువవచ్చును.

ఉపవాస దీక్షలు...


ముస్లింలంతా పవిత్రంగా జరుపుకునే పండుగ రంజాన్. నెల రోజుల పాటు ఖురాన్ పఠనంతో పాటు ఉపవాస దీక్షను తప్పక ఆచరిస్తారు. తెల్లవారు జాము కంటే ముందే అన్నపానీయాలు స్వీకరించి, సూర్యాస్తమయం వరకూ మంచి నీళ్లు సైతం తీసుకోకుండానే ఉపవాస దీక్షను కొనసాగిస్తారు. రోజు మొత్తంలో ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా, నీటికి సైతం దూరంగా ఉంటారు. యుక్త వయస్సు వచ్చిన ప్రతి ముస్లిం వ్యక్తి ఉపవాసం ఉంటారు.


తరావీహ్..


రంజాన్ సమయంలో మాత్రమే చేసే ఒక ప్రత్యేక ప్రార్థన తరావీహ్. తరావీహ్ అనేది చివరి రోజువారీ ప్రార్థన అయిన ఇషా తర్వాత చేసే రాత్రి ప్రార్థన. 'తరావీహ్' అనే పదానికి 'విశ్రాంతి మరియు విశ్రాంతి తీసుకోవడం' అని అర్థం. రంజాన్ మాసంలో ఆరాధనలో ముఖ్యమైన భాగం. ముస్లింలు మసీదులలో సమావేశమై ఖురాన్ పారాయణం వింటారు. తరావీహ్ లో 30 రోజులపాటు ఖురాన్ పారాయణం వింటారు.
Comments
 -Advertisement-