తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు ముగ్గురిపై కేసులు నమోదు
By
Vaasthava Nestham
• ఏసీబీ కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పిన ఇచ్చోడ మండలానికి చెందిన ముగ్గురిపై కేసు
• వివరాలు వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: ఏసీబీ కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పిన ఇచ్చోడ మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తుల పైన కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. గతంలో జిల్లా విద్యుత్ శాఖలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ గా విధులు నిర్వర్తించిన రేగుంట స్వామి 2010 వ సంవత్సరంలో రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడ్డారు.
అప్పటినుంచి ఏసీబీ కోర్టులో కేసు ట్రయల్ రన్ నడుస్తుండగా, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ పై ఫిర్యాదు చేసిన వ్యక్తులే తిరిగి సదరు ఏసీబీ కి పట్టుబడిన ఉద్యోగికి అనుకూలంగా కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పినట్లు డీఎస్పీ తెలిపారు. తప్పుడు సాక్ష్యం చెప్పిన వారిలో అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం సిరిచెల్మ గ్రామానికి చెందిన కన్నమయ్య, నారాయణ, మల్లయ్య లు ఏసీబీ కోర్టులో తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చినందుకు కేసును రిజిస్టర్ చేసి వీరిపై చర్యలు తీసుకోవాలని ఏసీబీ కరీంనగర్ సెషన్ కోర్టు జడ్జి గురువారం తీర్పునిచ్చింది. ఇలా లంచావతార్లను పట్టించినట్టే పట్టించి మరలా తిరిగి వారికి అనుకూలంగా తప్పుడు సాక్ష్యం కోర్టులో చెప్పినట్లయితే ఇటువంటి శిక్షలు ఖరారు అవుతాయని, నిర్భయంగా ఎవరైనా లంచావతారుల గురించి ఏటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా తమ దృష్టికి తీసుకురావాలని, వారిని విషయాలు గొప్పగా ఉంచుతామని ఆదిలాబాద్ ఏసీబీ డిఎస్పి విజయ్ కుమార్ తెలిపారు.
Comments