నవోదయ పరీక్ష ఫలితాల్లో సత్తా చాటిన 'సన్ షైన్ స్కూల్' విద్యార్థులు
By
Vaasthava Nestham
• ముగ్గురు విద్యార్థులకు నవోదయలో సీట్లు
• నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం అంటున్న 'సన్ షైన్ స్కూల్' యజమాన్యం
వాస్తవ నేస్తం,ఇచ్చోడ: మండల కేంద్రంలోని సన్ షైన్ స్కూల్ విద్యార్థులు మంగళవారం వెలువడిన నవోదయ పరీక్ష ఫలితాల్లో సత్తా చాటారు. ఒకే పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు నవోదయలో సీటు సాధించి అందరి అభినందనలు పొందుతున్నారు.
సన్ షైన్ పాఠశాలలో విద్యా అభ్యసించే పాముల సిద్ధార్థ అంబేద్కర్, పాముల గౌతం కృష్ణ, చౌహన్ పృధ్విరాజ్ అనే విద్యార్థులు నవోదయాలో సీటు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల యజమాన్యం విద్యార్థులకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు.
నాణ్యమైన విద్య అందించడమే సన్ షైన్ లక్ష్యం..
ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం , పెద్ద పెద్ద పట్టణాలలో ఉన్న కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తమ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా పాఠశాల యజమాన్యం తెలిపింది. విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా తీర్చిదిద్దడం కోసం పాఠశాల సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారని.. రానున్న రోజుల్లో నవోదయ తో పాటు సైనిక్ స్కూల్ లలో అధిక సీట్లు తమ విద్యార్థులు సాధించేలా శిక్షణ ఇస్తున్నట్లు యజమాన్యం తెలిపింది.
Comments