-Advertisement-

ACB Ride: ఏసీబీకి పట్టుబడిన మాస్ మీడియా అధికారి

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : వేళల్లో జీతాలు ఉన్నా కూడా కొందరు ఆఫీసర్లు లంచాలకు అలవాటు పడి, లంచాలు తీసుకుంటూ ఏసీబీ కి చిక్కుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సంవత్సర వ్యవధిలో దాదాపు ఆరుగురు వివిధ శాఖలకు సంబంధించిన ఆఫీసర్లు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినారు. 
ఈరోజు (శుక్రవారం) లంచం తీసుకుంటూ మాస్ మీడియా అధికారి రవిశంకర్ ఏసీబీకి పట్టుబడినారు. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్ మండలం మన్నూరు గ్రామంలో ఇటీవల ఓ మైనర్ బాలిక అబార్షన్ విషయంలో తన మెడికల్ నుంచే మందులు సరఫరా అయ్యాయని అనుమానాలు వ్యక్తం చేస్తూ స్థానికంగా ఉన్న ఓ మెడికల్ షాపును జిల్లా మాస్ మీడియా అధికారి గురువారం తనిఖీ చేస్తూ సీల్ చేశారు. కాగా ఈ మెడికల్ షాపును తిరిగి ఓపెన్ చేయాలంటే తనకు రూ. 30 వేలు కావాలని బాధితుడిని లంచం అడిగినట్లు అధికారులు తెలియజేశారు. బాధితుడు ఫిర్యాదు మేరకు రూ.30 వేల లంచం తీసుకుంటూ ఉండగా సదరు మాస్ మీడియా జిల్లా అధికారి రవిశంకర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు ఏసీబీ అధికారులు తెలియజేశారు.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.