మాస్ కాపింగ్ కు సహకరిస్తున్నది వారేనా..!?
By
Vaasthava Nestham
• విద్యార్థులు 100% ఉత్తీర్ణత అయ్యేలా సహకారం..?
• జిరాక్స్ సెంటర్లు క్లోజ్ ఉన్న కూడా మైక్రో జిరాక్స్ తీస్తున్నది ఎక్కడ...?
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: జిల్లాలోని ఇచ్చోడ మండలంతో పాటు సిరికొండ మండలంలోని వివిధ పాఠశాలలో పదవ తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. పదో తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ఫైనల్ పరీక్షల్లో విద్యార్థులందరూ 100% ఉత్తీర్ణులు అయ్యేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని జిల్లా స్థాయిలోని ఉన్నతాధికారులు ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ఆ దేవుడు ఎరుగు కానీ ఆ విద్యార్థులు ఫైనల్ పరీక్షల్లో పాస్ అయ్యేలా ఇచ్చోడ, సిరికొండ మండలలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
మాస్ కాఫింగు సంబంధించిన జిరాక్స్ లు ఇచ్చోడ మండల కేంద్రం నుండి సరఫరా ఐతున్నట్లు చర్చలు జరుగుతున్నాయి. పరీక్ష సమయాల్లో జిరాక్స్ సెంటర్లు మూసి ఉన్న దృశ్య కొందరు ఉపాధ్యాయులే మాస్ కాపింగ్ జిరాక్సులు ఇచ్చోడ మండల కేంద్రంలోని ఓ కాలనీలో తీస్తూ ఆయా పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులే పాఠశాలలకు సరఫరా చేస్తున్నట్టు..!? చర్చలు జరుగుతున్నాయి.
Comments