రండి.. సిరిచెల్మ పిలుస్తోంది...!
By
Vaasthava Nestham
• జాతరకు ముస్తాబైన మల్లికార్జునాలయం
• నేడు జాతర ప్రారంభం..
• వారం రోజుల జాతర ఉత్సవాలు..
• తల్లి రానున్న భక్తులు.. ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న ఆలయ కమిటీ
వాస్తవ నేస్తం,ఇచ్చోడ : పొడిచేటి పొద్దువోలే దివ్యంగా వెలిగే దివ్యవోలే.. అందమైన రూపం నీది అన్నా మల్లాన్నా... సుందరంగా వెలిసినావ అన్నా మల్లన్నా... అంటూ భక్తులు పారవశ్యంతో కొలిచే సిరిచెల్మ లోని మల్లికార్జున ఆలయంలో నేటి నుంచి జాతర ప్రారంభ కానుంది. ఇందుకోసం ఆలయ కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. పల్లె పట్నం తేడా లేదు.. పేద, పెద్ద అంతరం అంతకన్నా లేదు.. భాషలు వేరైనా భావం ఒక్కటే.. మతాలు వేరైనా మనుషులంతా ఒక్కటే.. అందరూ ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ గ్రామంలో నిర్వహించే జాతరకు భక్తితో వెళ్ళడం తరతరాల నుంచి వస్తున్న సంప్రదాయం.
ప్రతి సంవత్సరం శివరాత్రి పండుగ తర్వాత జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఏడు రోజుల పాటు జరిగే ఈ జాతరలో కష్టాలను మర్చిపోయి పండుగను చేసుకుంటారు. దూరం నుంచి వచ్చిన వారు అక్కడే గుడిసెలు వేసుకుని ఉంటారు. దీంతో ఈ జాతర సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. వేలాదిగా భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు.. మొక్కులను తీర్చుకుంటారు.
సిరిచెల్మ గ్రామంలోనీ మల్లికార్జున స్వామి ఆలయం అతి ప్రాచీనమైనది. ఈ శివాలయం మతసామరస్యా నికి వేదికగా, సాంప్రదా యాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ ఆలయాన్ని మల్లికార్జున, సోమేశ్వర, మల్లన గుడిగా భక్తులు ఇలా పిలుస్తుంటారు. ఆలయంలో అన్ని మత వ్యవ స్థాపనకు చెందిన విగ్రహాలు కొలువుదీరి ఉన్నాయి. శివలింగంతో పాటు అష్టదిగ్బాలకులు, వెంకటేశ్వర స్వామి గోపురం, కార్తి కేయుడు, గౌతమ బుద్ధుడు, ఆంజనేయుడు, నవ గ్రహాలు, ఏడు గోపురాలు, శని విగ్రహాలతో పాటు మరిన్ని దేవతల విగ్రహాలు కొలువు దీరి ఉన్నాయి. ప్రతి నిత్యం ఉదయం సూర్య కిరణా లు నంది విగ్ర హాన్ని ముద్దాడుతూ.. గర్భగుడిలో కొలువు దీరిన శివలింగంపై ఏటవాలుగా జాలు వారడం ఈ ఆలయం ప్రత్యేకత.

పొరుగు రాష్ట్రం నుంచి భక్తులు..
మీ జాతరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా పోరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోని కిన్వ ట్, నాందేడ్, చంద్రపూర్, యావత్ మాల్, పర్భని జిల్లాల నుంచి భక్తులు వేలాది సంఖ్యలో తరలి వస్తారు. బెల్లం (బంగారం) ముద్దలతో ప్రత్యేకంగా మొక్కలను తీర్చుకుంటారు.
జాతరకు వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు.

ప్రత్యేకంగా ఊరేగింపు...
జాతర సందర్భంగా ప్రతిరోజు మల్లికార్జున స్వామి శావళ్లను భాజా భజంతులతో గ్రామమంత కన్నుల పండుగగా ఊరేగిస్తారు. చివరి రోజు తెల్లవారు జామున రథచక్రాన్ని ప్రత్యేకంగా ఊరేగించి హోమ గుండం కాల్చడంతో ఈ జాతర ముగుస్తుంది. ముగింపు రోజున భక్తులు ఆలయం నడి మధ్యలో ఉన్న జలాశయంలో పుణ్య స్నానాలు ఆచరించి అగ్నిగుండంలో నడవటం ఈ జాతరకే ప్రత్యేకంగా నిలుస్తుంది.
Comments