-Advertisement-

మీ పిల్లలను ఇలాంటి స్కూల్లోనే చదివిపిస్తారా...?

Vaasthava Nestham

• గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ పక్కన జంతు కళేబరా వ్యర్ధాలు
• దుర్గంధ భరితమైన వాసనతో పరిసర ప్రాంతాలు
• పట్టించుకోని అధికారులు


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : అధికారుల నిర్లక్ష్యానికి నిలుపుట అద్దం ఈ దృశ్యాలు.. విద్యార్థులకు ఏమైతే మాకేంటి అన్నట్లు అధికారుల తీరు ఉందని , అధికారుల పిల్లలు ఉంటే ఇలాంటి వాతావరణం లోనే చదివిస్తారాని విద్యార్థినిల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ఈ పాఠశాలలో ఓ విద్యార్థిని మృతి చెందిన విషయం విధితమే.. ఇదే పాఠశాల ప్రక్కన కుళ్ళపోయిన జంతు కళేబర వ్యర్థాలు కుప్పలు కుప్పలుగా ఉన్నా కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదని అధికారుల తీరుపై విద్యార్థినిల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. 
వివరాల్లోకి వెళితే.. ఇచ్చోడ మండలంలోని బాలికల ఆశ్రమ పాఠశాల సమీపంలోని వాగులో పెద్దమొత్తంలో జంతు కళేబరాలు పాడేయడంతో అక్కడి ప్రదేశంలో కంపు కొడుతుంది. సంచుల్లో పాఠశాలకు అనుకుని ఉన్న బ్రిడ్జి వద్ద చెత్త తో పాటు కుళ్లిపోయిన జంతువుల వ్యర్థాలను ఇక్కడ పడేయడంతో పాఠశాలలో విద్యాభ్యసించే విద్యార్థినుల ఆరోగ్యంపై వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థినిల ఆరోగ్యాన్ని దృష్టిలో దృష్టిలో పెట్టుకుని ఈ వ్యర్థ పదార్థాలు తొలగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థినిల తల్లిదండ్రులు కోరుతున్నారు. 


Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.