కార్పోరేటర్ కాదు.. కామాంధుడు
By
Vaasthava Nestham
• ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన సబిత అనుచరుడు.!
వాస్తవ నేస్తం, వెబ్ డెస్క్: హైదరాబాద్ మీర్ పేట్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ మంత్రి సబిత అనుచరుడైన పూర్ణేశ్వర్ రెడ్డి ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేశాడు. పెళ్లి చేసుకోవాలని కోరడంతో కులాలు వేరని దూరం పెట్టాడని ఆ యువతి ఆరోపించింది.
ప్రేమిస్తున్నానని ఆ యువతిపై పలుమార్లు అత్యాచారం చేశాడని పూర్ణేశ్వర్ రెడ్డిపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది.36వ డివిజన్ కార్పోరేటర్ పూర్ణేశ్వర్ ఇంటి ఎదుట యువతి ధర్నా చేసింది. యువతి ఫిర్యాదుతో ఎస్సీ,ఎస్టీ పోక్సో సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments