-Advertisement-

Breaking News : ఇచ్చోడ బాలికల గురుకులంలో విద్యార్థిని మృతి..!?

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడాలో మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థిని చనిపోయినట్లుగా సమాచారం అందుతుంది..? కాగా గుట్ట చప్పుడు కాకుండా పాఠశాల సిబ్బంది మృతి చెందిన విద్యార్థినీ యొక్క కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బాలిక మృతదేహాన్ని తీసుకెళ్ళాలని చెప్పినట్లు సమాచారం..!? బజార్ హత్నూర్ మండలంలోని మోర్కండి గ్రామానికి చెందిన రాజేశ్వర్ యొక్క కూతురు లాలిత్య ( 13) గురుకులం ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. అయితే బాలిక చనిపోయిన విషయం పాఠశాల సిబ్బంది ఫోన్ చేసి చెప్పడంతో బాలిక కుటుంబ సభ్యులు పాఠశాలకు చేరుకున్నారు. అయితే మృత దేహం తీసుకెళ్ళాలని కుటుంబ సభ్యులకపై పాఠశాల సిబ్బంది ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.


Comments
 -Advertisement-