-Advertisement-

Jio Offer: జియో బంపర్ ఆఫర్.. కొత్త రీఛార్జ్ ప్లాన్.. తెలిస్తే జియో నెంబర్ కు పోర్ట్ అవుతారు

Jio offers list , Jio offers prepaid , jio recharge plan 3-month , Jio recharge plans 1 Month , Jio 5G recharge plans list , Jio Data Plans for 1 day
Vaasthava Nestham
Jio Offer: కొంతమంది రెండు సిమ్ కార్డులను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వాళ్లు ఆ రెండు సిమ్ కార్డులను యాక్టివ్ గా ఉంచడం కోసం ఆందోళన చెందుతూ ఉంటారు. ఇటువంటి వారి కోసం జియో చాలా చౌకైన ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ను చూసిన తర్వాత మీరు కూడా వెంటనే మీ నెంబర్ను జియోకు పోర్ట్ చేసుకుంటారు. ఈరోజుల్లో చాలామందికి రెండు సిమ్ కార్డులు ఉంటాయి. కొంతమంది వ్యక్తిగత మరియు వృత్తిపరమైన పరిచయాలను విడివిడిగా నిర్వహించడానికి రెండవ సిమ్ కార్డును ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఆ రెండవ సిమ్ కార్డును యాక్టివ్ గా ఉంచాలంటే చాలా డబ్బులు ఖర్చు చేయాలి. ఈ క్రమంలో జియో ఒక మంచి ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది.

మీరు మీ జేబు పై ఎక్కువ భారం పడకుండా రెండు సిమ్ కార్డులను ఆక్టివ్ గా ఉంచడానికి జియో కి చెందిన ఈ సరసమైన రీఛార్జి ప్లాన్ మీకు చాలా మంచి ఎంపిక అని చెప్పొచ్చు. మీరు జియో సిమ్ కార్డును రెండవ సిమ్ కార్డుగా ఉపయోగించవచ్చు. ఈ క్రమంలో మీరు అపరిమితమైన కాల్స్ అలాగే రోజువారి ఎస్ఎంఎస్ తో పాటు తగినంత డేటాతో టెలికాం కంపెనీ నుంచి వివిధ సరసమైన ఆఫర్లను పొందవచ్చు. అయితే ఈ సరసమైన ఆఫర్లు కేవలం సెకండ్ వాడుతున్న వాళ్లకు మాత్రమే కాదు మీరు ప్రధానంగా వైఫై ద్వారా ఇంటర్నెట్ ను ఉపయోగిస్తుంటే ఈ ప్లాన్లు మీకు ఉపయోగపడతాయి.

జియో రూ.75 ప్లాన్లో మీకు 23 రోజుల చెల్లుబాటు ఉంటుంది. ఈ ప్లాన్ లో మీరు 2జీబి డేటా మరియు 50 ఎస్ఎంఎస్లు పొందవచ్చు. అలాగే జియో టు జియో కు అపరిమిత కాలింగ్ సదుపాయం కూడా ఉంది. జియో రు. 91 ప్లాన్ లో మీరు 28 రోజుల చెల్లుబాటు పొందవచ్చు. ఇందులో మీకు 3gb డేటా మరియు 50 ఎస్ఎంఎస్లు ఉంటాయి. జియో టు జియో కు అపరిమిత కాలింగ్ ఉంటుంది. జియో రూ. 125 ప్లాన్ లో మీరు 23 రోజుల చెల్లుబాటు పొందవచ్చు. ఇందులో మీకు 14 జిబి డేటా మరియు 300 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. జియో టు జియో అపరిమిత కాలింగ్ ఉంటుంది.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.