-Advertisement-

Karimnagar MLC Election Results: పట్టభద్రుల ఎమ్మెల్సీ కూడా బీజేపీ ఖాతాలోనే

Vaasthava Nestham

• వీడిన ఉత్కంఠ.. కరీంనగర్ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానం బీజేపీ కైవసం..


వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: టీచర్స్ ఎమ్మెల్సీ , పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ తన ఖాతాలోనే వేసుకుంది. ఇదివరకు టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ పార్టీ తరఫునుండి పోటీ చేసిన అభ్యర్థి గెలుపుండగా కరీంనగర్ గ్రాజువేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. కరీంనగర్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో అంజిరెడ్డి విజయం ఖరారైంది. అంజిరెడ్డికి 78,635 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి 73,644 ఓట్లు వచ్చాయి. 
బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 63,404 ఓట్లు పడ్డాయి. అంజిరెడ్డి విజయం ఖరారు కావడంతో కౌంటింగ్ హాలు నుంచి నరేందర్ రెడ్డి వెళ్లిపోయారు. కాగా, కరీంనగర్ టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీ వశం అయ్యాయి. మరోవైపు అంజిరెడ్డి విజయంపై ఎన్నికల అధికారులు మరికాసేపట్లో ప్రకటన చేయనున్నారు.
Karimnagar MLC Election Results
Comments
 -Advertisement-