-Advertisement-

Pds Rice : మళ్ళీ.. ఇచ్చోడలో బియ్యం లారీ పట్టివేత

Vaasthava Nestham

• వారం రోజుల వ్యవధిలో రెండు లారీలు పట్టుకున్న పోలీసులు 
• దాదాపు 600 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం 


వాస్తవ నేస్తం,ఇచ్చోడ: వారం రోజుల వ్యవధిలో ఇచ్చోడ మండల కేంద్రం గుండా వెళుతున్న రెండు రేషన్ బియ్యం లారీలను పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు.. నిజామాబాద్ జిల్లా బోధన్ నుండి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి లారిలో బియ్యం తరలిస్తుండగా ఇచ్చోడ వద్ద సరైన పత్రాలు లేని బియ్యంతో వెళుతున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న బియ్యం రేషన్ బియ్యమా..? కాదా..? అనేది ఇంకా తెలియవలసి ఉంది. 
గతవారం క్రితం 300 క్వింటాల రేషన్ బియ్యం తో వెళ్తున్న లారీని పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు. వారం రోజుల వ్యవధిలోనే బియ్యం లోడుతో వెళ్తున్న రెండు లారీలు ఇచ్చోడ లో పట్టుబడడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వారం రోజుల క్రితమే ఓ లారీ పట్టుబడిన కూడా అక్రమ రేషన్ మాఫియా బియ్యాన్ని తరలించడంలో ఏమాత్రం తగ్గకపోవడంతో అక్రమ రేషన్ వ్యాపారం ఏ స్థాయిలో మాఫియాకు కాసులు కురుస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. రేషన్ మాఫియాకు పై స్థాయి అధికారుల అండదండలు ఉన్నాయని ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.