-Advertisement-

Ration Card: రేషన్ కార్డు ఉన్నవారికి హెచ్చరిక.. ఈ పని చేయకపోతే.. ఏప్రిల్ 1 నుంచి మీ కార్డు..

Ration card Telangana , Ration Card Download, Ration Card online check , Ration Card Status , TS Ration card download, Telangana Ration card status
Vaasthava Nestham
Ration Card: కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలకు ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు లేదా బిపిఎల్ కార్డు అత్యవసరం చేశాయి. ఇప్పటికీ మీ ఈ కేవైసీ పూర్తయి ఉంటే ప్రభుత్వం నుంచి మీకు ఈ పథకాలు ప్రయోజనాలు అందడం సులభం అవుతుంది. ఇప్పటివరకు ఈ కేవైసీ పూర్తి చేయకపోతే ఇకపై ప్రభుత్వం అందించే రేషన్ ఆగిపోవచ్చు. తాజాగా ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్నవాళ్లకి ఒక్క ముఖ్యమైన అలర్ట్ ప్రకటించింది. ఇప్పటివరకు మీరు రేషన్ కార్డుకు సంబంధించిన ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయకపోతే ఏడో రోజులలోపు వెంటనే దానిని పూర్తి చేసుకోవాలి. లేకపోతే మీకు వచ్చే నెల అంటే ఏప్రిల్ నుంచి రేషన్ ప్రయోజనాలు అందడం ఆగిపోతాయి.

రేషన్ కార్డు హోల్డర్ నిర్దేశి ంచిన తేదీలోపు వెంటనే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి. లేకపోతే అటువంటి సభ్యుల పేర్లు రేషన్ కార్డు నుండి ప్రభుత్వం తొలగించండి. వాళ్లకు ఆహార ధాన్యాల పంపిణీ కూడా లేకుండా పోతుంది. రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డు హోల్డర్లు ఈ కేవైసీ చేయించుకోవడానికి వారు పిడిఎఫ్ దుకాణం లేదా డీలర్ ను సంప్రదించుకోవచ్చు. అయితే ఒక రేషన్ కార్డు హోల్డర్ వేరే రాష్ట్రంలో ఉన్నట్లయితే ఆధార సీడింగ్ కోసం అతను తన సొంత రాష్ట్రానికి వెళ్లాల్సిన అవసరం లేదు.

లబ్ధిదారులు తమకు సమీపంలో ఉన్న ప్రజా పంపిణీ వ్యవస్థ దుకాణానికి వెళ్లి ఈ పి ఓ ఎస్ యంత్రం ద్వారా ఈ కివైసీ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఝార్ఖండ్ ప్రభుత్వం ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి 31వ తేదీ గడువుగా ప్రకటించింది. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి రేషన్ కార్డు ఉన్నవాళ్లు పిడిఎఫ్ దుకాణం లేదా డీలర్ ను సంప్రదించవచ్చు. అలాగే ఒకవేళ మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే జిల్లా సరఫరా కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. అలాగే బీహార్ ప్రభుత్వం ఈ కేవైసీ పూర్తి చేయడానికి మార్చి 31 చివరి తేదీగా నిర్ణయించింది. ఆధార్ సీడింగ్ డీలర్ దుకాణంలో ఉచితంగా చేయించుకోవచ్చు.


Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.