Ration Card: రేషన్ కార్డు దారులకు శుభవార్త... ఉగాది నుంచి సన్న బియ్యం ..
Rice Distribution scheme in Telangana, Ration rice price in Telangana, Ration Shop items prices, Ration rice online, Rice distribution in India
By
Vaasthava Nestham
Ration Card: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉగాది పండుగకు ముందే తీపి కబురును చెప్పింది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఇప్పటివరకు ప్రతి ఒక్కరికి ఇస్తున్న 6 కేజీల చొప్పున ఉచితంగా అందజేస్తున్న రేషన్ బియ్యం సద్వినియోగం అవడం లేదని భావించి సన్నబియ్యం ఇస్తామని ప్రకటించడం జరిగింది. తాజాగా అసెంబ్లీ లో పద్దుల పై చర్చ జరిగిన సమయంలో మంత్రి రాష్ట్రంలో 80 శాతం మందికి ఉచితంగా ఇస్తున్న రేషన్ బియ్యం దుర్వినియోగం అవుతున్నందున రేషన్ బియ్యాన్ని అమ్ముకోవడం ద్వారా రేషన్ మాఫియా ఏర్పడిందని దాన్ని అరికట్టడానికి దాని స్థానంలో సన్నబియాన్నే రేషన్ కార్డుదారులకు అందజేస్తామని ప్రకటించారు.
ఈ క్రమంలో ఈ ఏడాది ఉగాది పండుగ రోజున అంటే మార్చి 30న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఈ సన్న బియ్యం పంపిణీ ఉగాది పండుగ రోజు నుంచి మొదలు అవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. అలాగే ఆయన మాట్లాడుతూ రేషన్ బియ్యం తో పాటు రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నిత్యవసర వస్తువులు కూడా త్వరలోనే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అతి త్వరలో ఒక మంచి రోజున వాటిని కూడా రాష్ట్ర ప్రజలకు అందజేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఏడాదికి 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇస్తున్న క్రమంలో అవి పక్కదారి పట్టడాన్ని అరికట్టేందుకే సన్నబియ్యం ఇవ్వబోతున్నట్లుగా మంత్రి ప్రకటించారు. ఈ క్రమంలో ఉగాది పండుగ రోజున పిడిఎస్ రైస్ కోటాలో సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు 80 శాతం మంది ప్రజలకు ఆహార భద్రత కోసం దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యం ఇస్తామన్నారు మంత్రి. ఒకవేళ రేషన్ కార్డులో మీ పేరు లేకపోయినా రేషన్ డీలర్ దగ్గర ఉన్న మిషన్లో మీ పేరు వచ్చిన వాళ్లకు రేషన్ అందిస్తామన్నారు.
Comments